ఏపీలో రేపటి నుంచి పర్యాటక ప్రాంతాలన్నీ ప్రారంభం

-

అమరావతి : పర్యాటక శాఖపై మంత్రి అవంతి శ్రీనివాస్ ఇవాళ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కరోనా సమయంలో పర్యాటక రంగ పరిస్థితిపై చర్చ నిర్వహించారు. కరోనా వల్ల కోట్లాది రూపాయల మేర పర్యాటక రంగానికి నష్టం వాటిల్లిందని మంత్రి నివేదిక సమర్పించారు అధికారులు. పర్యాటకాన్ని అనుమతించే అవకాశం ఉందా లేదా అనే అంశంపై సమీక్షలో ప్రస్తావనకు వచ్చాయి. కోవిడ్ ప్రొటోకాల్ పాటిస్తూ పర్యాటకానికి అనుమతివ్వొచ్చన్న అధికారులు పేర్కొనగా… రాష్ట్రంలోని పర్యాటక ప్రాంతాలను గురువారం(రేపటి నుంచి) నుంచి కార్యకలాపాలు ప్రారంభించాలని మంత్రి అవంతి ఆదేశాలు జారీ చేశారు.

బోటింగ్ విషయంలోనూ వీలైనంత త్వరగా నిర్ణయం తీసుకోవాలన్న మంత్రి… గురువారం బోట్ ఆపరేటర్లతో భేటీ కానున్నారు. ఇక రేపటి నుంచి పర్యాటక ప్రాంతాలన్నీ ప్రారంభించాలని… రాష్ట్ర పర్యాటక ప్రాంతాల ప్రాముఖ్యతను చాటి చేప్పే విధంగా దేశ ప్రధాని నగరాల్లో రోడ్ షోలు నిర్వహించాలని ఆదేశించారు. విశాఖపట్నం ఋషికొండలోని పర్యాటక శాఖ బ్లూబే హోటల్ ను రూ. 164 కోట్లతో అభివృద్ధికి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.

 

Read more RELATED
Recommended to you

Latest news