అల్లరి నరేష్ “ఉగ్రం” మూవీ షూటింగ్ ప్రారంభం

-

కెరీర్ లో యాబై ఆరు చిత్రాలు చేసి తనకంటూ ఓ ప్రత్యేకమైన పేరు తెచ్చుకున్న అల్లరి నరేష్.. ఇప్పుడు మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. అల్లరి నరేష్ హాస్య కథానాయకుడిగా చక చక 50 సినిమాలకు పైగా పూర్తి చేసుకున్న హీరో. అప్పుడప్పుడు ఆయన విలక్షణమైన పాత్రలను కూడా చేస్తూ తన సత్తా చాటుకున్నాడు. అలా ఆ మధ్య వచ్చిన ‘నాంది’ సినిమా భారీ విజయాన్ని నమోదు చేసింది. నూతన దర్శకుడు విజయ్ కనకమెడలకు ఈ సినిమా మంచి పేరు తీసుకుని వచ్చింది. అదే దర్శకుడుతో అల్లరి నరేష్ ఇప్పుడు ‘ఉగ్రం’ సినిమా చేస్తున్నారు.

ఈ కాంబోలో రెండవ సినిమా తెరకెక్కనున్నట్లు గతంలోనే ప్రకటన రాగా.. ఇటీవల టైటిల్ పోస్టర్ను విడుదల చేశారు. ఈ పోస్టర్ కు ప్రేక్షకుల నుండి విషెష స్పందన వచ్చింది. క్రైమ్ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కనున్న ఈ చిత్రాన్ని షైన్ స్క్రీన్ పథకం పై సాహు గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రం షూటింగ్ హైదరాబాదులో ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ లో మేకర్స్ కీలక సన్నివేశాలను తెరకెక్కించనున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నరేష్ నటించిన ” ఇట్లు మారేడుమిల్లి నియోజకవర్గం” చిత్రం విడుదలకు సిద్ధంగా ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news