టిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, తెలంగాణ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ఇటీవల మరోసారి కరోనా బారిన పడిన విషయం తెలిసిందే. ఆయన ఇటీవలే కాలిగాయం నుంచి కోలుకొని అధికారిక కార్యక్రమాల్లో పాల్గొన్నారు. అంతలోనే ఆయన 2 వ సారి కరోనా బారిన పడ్డారు. అయితే గత ఆరు రోజుల నుంచి హోమ్ ఐసోలేషన్లో ఉన్న మంత్రిి కేటీఆర్ కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నారు.
ఈరోజు చేసిన కరోనా పరీక్షల్లో నెగిటివ్ వచ్చినట్లు వైద్యులు ధ్రువీకరించారు. కాగా మంగళవారం నుంచి జరగనున్న అసెంబ్లీ సమావేశాలకు మంత్రి కేటీఆర్ హాజరుకానున్నారు.