ముగిసిన తొలి విడుత ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు

-

మొదటి విడత ఇంజనీరింగ్ సీట్ల కేటాయింపు ముగిసింది. ఈ మేరకు అలాట్మెంట్ ఆర్డర్ను ఉన్నత విద్యాశాఖ అధికారులు శుక్రవారం రాత్రి విడుదల చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా వెబ్ ఆప్షన్లు ఇచ్చిన 95,383 మంది విద్యార్థులకు సంబంధించి మొదటి విడతలో 70,665 ఇంజినీరింగ్ సీట్లను కేటాయించారు. ఈ కేటాయింపులతో 12,001 సీట్లు 14.52 శాతం మేర భర్తీ కాకుండా మిగిలాయి. సీటు పొందిన విద్యార్థులు ఈనెల 22లోగా సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాలని ఎంసెట్ కన్వీనర్ సూచించారు.

కోర్సుల వారీగా తొలి విడతలో సీఎస్ఈలో 94.20 శాతం, ఈఈఈలో 58.38, సివిల్లో 44.76, మెకానికల్లో 38.50 శాతం సీట్లు భర్తీ అయ్యాయి: 3 యూనివర్సిటీలు, 28 ప్రైవేటు కాలేజీల్లో ఇంజినీరింగ్ సీట్లు హౌజ్ఫుల్ అయినట్లుగా అధికారులు వెల్లడించారు. అలాట్మెంట్ ఆర్డర్ కోసం విద్యార్థులు http://tseapcet.nic.in/ వెబ్సైట్ను సంప్రదించాలని అధికారులు తెలిపారు.

Read more RELATED
Recommended to you

Latest news