గ్రూపు 2 పరీక్షలు వాయిదా.. అధికారికంగా TGPSC ప్రకటన

-

పరీక్షల మధ్య వారం రోజులు మాత్రమే వ్యవధి ఉండటంతో.. ఈ పరీక్ష వాయిదా వేయాలంటూ అభ్యర్థుల ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. దీంతో చర్చలు జరిపిన ప్రభుత్వం ఆగస్టులో జరగాల్సిన గ్రూప్-2 పరీక్షలను డిసెంబర్  రీ షెడ్యూల్ చేస్తూ నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ లో పరీక్షలు జరిగే తేదీలను తర్వాత ప్రకటించనున్నట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి నవీన్ నికోలస్ ఓ ప్రకటనలో తెలిపారు.

 

మొత్తం 783 గ్రూప్- 2 పోస్టుల భర్తీకి షెడ్యూల్ ప్రకారమైతే.. ఆగస్టు 7, 8 తేదీల్లో పరీక్షలు జరగాల్సి ఉంది. మరోవైపు, 1,388 గ్రూప్ -3 ఉద్యోగ రాత పరీక్షలను సైతం వాయిదా వేసే
అవకాశం ఉంది. షెడ్యూల్ ప్రకారం నవంబర్ 17, 18 తేదీల్లో గ్రూప్ 3 పరీక్షలు జరగాల్సి ఉంది. రాష్ట్రంలో గ్రూప్ -2 ఉద్యోగాలకు 5.51లక్షల మంది, గ్రూప్ 3 పోస్టులకు 5లక్షల మందికి పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఈ పరీక్ష వాయిదా పడుతుందో లేదో ఇంకా క్లారిటీ లేదు.

Read more RELATED
Recommended to you

Latest news