బ‌న్నీకి హ్యాట్సాఫ్ చెబుతున్న నెటిజ‌న్లు.. మ్యాటర్ ఏంటంటే..?

-

అల్లు అర్జున్‌.. నాటి గంగోత్రి నుంచి నేటి అల వైకుంఠ‌పుర‌ములో వ‌ర‌కు ఈయ‌న టాలీవుడ్‌లో క్రియేట్ చేసిన రికార్డులు అన్ని ఇన్ని కావు. స్టైలిష్‌ స్టార్‌గా పేరు తెచ్చుకొన్న ఈయన యువతరానికి ఓ ఐకాన్‌. తెలుగు ప్రేక్ష‌కులు బ‌న్నీ అని.. మలయాళ ప్రేక్ష‌కులు మల్లు అర్జున్‌ అని ముద్దుగా పిలుచుకునే ఈయ‌న‌ ఇప్ప‌టికి సినీ ఇండ‌స్ట్రీల్లో పదహడేళ్ల ప్రయాణం పూర్తి చేసుకున్నారు. ఈ కాలంలో న‌టుడిగానే కాకుండా.. వ్య‌క్తిత్వంలోనూ అంతే స్థాయిలో మంచి పేరు సంపాదించుకున్నారు.

ఇక తాజాగా త‌న మంచిత‌నాన్ని మ‌రోసారి నిరూపించుకుని నెటిజ‌న్ల చేత హ్యాట్సాఫ్ అనేలా చేశారు. పూర్తి వివ‌రాల్లోకి వెళ్తే.. అల్లు అర్జున్ తన దగ్గర పనిచేసే అసిస్టెంట్ బర్త్‌డేను ఘనంగా నిర్వహించి తన పెద్ద మనసు చాటుకున్నాడు. శివ అనే వ్యక్తి చాలా కాలంగా అల్లు అర్జున్ దగ్గర పర్సనల్ అసిస్టెంట్‌గా పనిచేస్తున్నాడు. శివ‌ది నేడు పుట్టన రోజు కావ‌డంతో.. స్వయంగా బన్నీనే సెలబ్రేట్ చేశాడు.

Telugu Star Allu Arjun Celebrates His Personal Assistant's ...

మ‌రో విష‌యం ఏంటంటే.. బయట కేక్‌ లాంటివి ఏవీ అందుబాటులో లేకపోయినా తన ఇంట్లోనే కేకును తయారు చేయించారు. అనంతరం కేక్ కట్ చేయించి అతని కళ్లల్లో సంతోషం నింపాడట. ప్ర‌స్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైర‌ల్ అయ్యాయి. అవి చూసిన నెటిజ‌న్లు బ‌న్నీ ప్ర‌శంస‌ల జ‌ల్లు కురిపిస్తున్నారు. కాగా, ఇటీవ‌ల అల వైకుంఠ‌పురములో సినిమాతో భారీ హిట్ కొట్టిన బ‌న్నీ.. అదే జోరుతో క్రియేటివ్ డైరెక్ట‌ర్ సుకుమార్ తెర‌కెక్కిస్తున్న పుష్క సినిమాలో న‌డిస్తున్నారు. ప్ర‌స్తుతం లాక్‌డౌన్ కారంణంగా షూటింగ్ వాయిదా ప‌డ‌డంతో బ‌న్నీ ఇంట్లోనే కుటుంబ స‌భ్య‌ల‌తో ఎంజాయ్ చేస్తున్నాడు.

Read more RELATED
Recommended to you

Latest news