ఎన్టీఆర్ కి విలన్ గా చేయడానికి బాలీవుడ్ స్టార్ రెడీ…!

-

మార్కెట్ పెరగడం తో ఇతర భాషల వాళ్ళు కూడా మన తెలుగు సినీ పరిశ్రమ మీద ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. క్రమంగా మార్కెట్ పెంచుకునే ప్రయత్నాలు ఇతర భాషల వాళ్ళు చేస్తున్నారు. మన తెలుగు హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు చేయడం తో వాళ్ళు కూడా తమ తమ భాషల్లో సహాయ సహకారాలు అందిస్తూ వస్తున్నారు. ప్రస్తుతం టాలీవుడ్ లో బాలీవుడ్ నటులు ఎక్కువగా కనపడుతున్నారు.

అగ్ర హీరోలు, నిర్మాతలు, హీరోయన్ లు ఇప్పుడు ఇక్కడ ఎక్కువగా దృష్టి పెడుతున్నారు. ఎన్టీఆర్ త్రివిక్రమ్ సినిమాలో విలన్ గా చేయడానికి గానూ ఒక బాలీవుడ్ స్టార్ హీరో రెడీ అయినట్టు సమాచారం. బాలీవుడ్ స్టార్ సంజ‌య్ ద‌త్‌ను ఇందులో విల‌న్‌గా నటించడానికి ఆసక్తి చూపిస్తున్నట్టు తెలుస్తుంది. ఇప్పటికే దర్శక నిర్మాతలు ముంబై లో సంజయ్ ని కలిసి చర్చలు కూడా జరిపారని సమాచారం.

ఎన్టీఆర్ కూడా అందుకు ఆసక్తి చూపిస్తున్నాడు. ప్రస్తుతం రాజమౌళి ధర్శకంలో ఆర్ఆర్ఆర్ సినిమా చేస్తున్నాడు ఎన్టీఆర్. ఈ సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఈ సినిమా షూటింగ్ ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా వాయిదా పడింది. త్వరలోనే కరోనా ప్రభావం దక్కిన వెంటనే షూటింగ్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఇటీవల రామ్ చరణ్ పాత్రకు సంబంధించి ప్రోమో విడుదల చేసారు.

Read more RELATED
Recommended to you

Latest news