పుష్ప-2 నుంచి అల్లు అర్జున్ పోస్టర్ రిలీజ్

-

సుకుమార్ దర్శకత్వంలో టాలీవుడ్ ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం పుష్ప-2 . పుష్ప ఫస్ట్ పార్ట్ ఓ రేంజ్ లో బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో ఇప్పుడు దానికి సీక్వెల్గా పుష్ప-ది రూల్ను తెరకెక్కిస్తున్న విషయం తెలిసిందే.ఇక ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ ఏడాది ఆగస్టు 15న పుష్ప 2 ను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి మేకర్స్ సన్నహాలు చేస్తున్నారు.

ఇదిలా ఉంటే… ఈ చిత్రం నుంచి ‘పుష్ప పుష్ప’ సాంగ్ రేపు సాయంత్రం 5.04 గంటలకు విడుదల కానుంది. ఆ పాటలో అల్లు అర్జున్ లుక్ను మేకర్స్ విడుదల చేశారు. సినిమాలో తన ట్రేడ్ మార్క్ బాడీ లాంగ్వేజ్ ప్రకారం ఓ భుజం పైకెత్తి, సిగరెట్ తాగుతూ ఉన్న ఐకాన్ స్టార్ పోస్టర్ ఆకట్టుకుంటోంది. తెలుగు, హిందీ, తమిళ్, కన్నడ, మలయాళ, బెంగాలీ భాషల్లో పాట రిలీజవుతుంది.ఈ సినిమాలో రష్మిక మందాన్న కథానాయికగా నటిస్తుంది. ఈ చిత్రానికి ఫేమస్ మ్యూజిక్ డైరెక్టర్ దేవిశ్రీప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు.

.

Read more RELATED
Recommended to you

Latest news