బన్ని వరుస సర్ ప్రైజ్ లకు రెడీ అవుతున్నాడా? అంటే అవుననే తెలుస్తోంది. ప్రస్తుతం అతడు నటిస్తున్న తాజా చిత్రం (ఏఏ19) టైటిల్ ని ప్రకటించి లోగోని రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. అందుకు త్రివిక్రమ్ అండ్ టీమ్ ఆగస్టు 15వ తేదీని లాక్ చేసిందని తెలుస్తోంది. అయితే హైదరాబాద్ లో జరిగే ఈ కార్యక్రమంలో అదే వేదికపై మరో సర్ ప్రైజ్ కూడా ఇవ్వబోతున్నాడట బన్ని.
![allu arjun staar clothing brand tollywood business](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/07/Allu-Arjun-1.jpg)
ఇప్పటివరకూ బన్ని థియేటర్ బిజినెస్ లో ప్రవేశిస్తున్నాడనే మాట్లాడుకున్న అభిమానులకు అతడు స్టార్ (ఎస్.టి.ఏ.ఏ.ఆర్) పేరుతో డిజైనర్ దుస్తుల బ్రాండ్ ని పరిచయం చేయబోతున్నారన్న ముచ్చటా సాగిస్తున్నారు. వస్త్ర శ్రేణి వ్యాపారంలో ఇప్పటికే రౌడీ వేర్ పేరుతో దేవరకొండ.. హంబుల్ పేరుతో మహేష్ ప్రవేశించారు. అదే బాటలో బన్ని కూడా కొత్తగా బ్రాండ్ ని పరిచయం చేస్తున్నారు. స్టార్ -ఎస్.టి.ఏ.ఏ.ఆర్ లో ఏఏ అనే సింబల్ ఉండేలా దీనిని తీర్చిదిద్దారని తాజాగా రివీలైన ఫోటో చెబుతోంది.
![allu arjun staar clothing brand tollywood business](https://cdn.manalokam.com/wp-content/uploads/2019/07/buny.jpg)
ప్రస్తుతం బన్ని బ్రాండ్ కి సంబంధించిన లోగో తో ఫోటో ఒకటి సామాజిక మాధ్యమాల్లో రివీలైంది. మరోవైపు ఏఏ20 (ఐకన్), ఏఏ 21 రెగ్యులర్ షూటింగ్ లను అక్టోబర్ లేదా నవంబర్ లో ప్రారంభించేందుకు బన్ని రెడీ అవుతున్నారని తెలుస్తోంది. 2020లో ఈ చిత్రాల్ని రిలీజ్ చేయాలన్న ప్లాన్ ఉంది.