కోరిన కోర్కెలు నెరవేర్చే పుణక్షేత్రం స్కందగిరి !

-

సుబ్రమణ్యం అంటే జ్ఞానానికి ప్రతీకగా భావిస్తారు. అంతేకాదు సర్వసైన్యాధక్షుడు ఆయన. శివపుత్రుడు. మహాబల శాలి. ఆయన్ను ఆరాధిస్తే సకల కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా వివాహం కానివారు, పిల్లలు లేనివారు, గ్రహదోషాలు ఉన్నవారు. శీఘ్రంగా కోరికలు నెరవేర్చే దేవుడిగా కుమారస్వామికి పేరు. అత్యంత మహిమాన్వితమై, కంచి పీఠం ఆధ్వర్యంలో కచ్చితమైన వేద సంప్రదాయంలో నిత్యం పూజలు జరిగే క్షేత్రం స్కందగిరి. ఆ క్షేత్రం మహిమ, పూజలు, ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం…

Importance of Skandagiri Subrahmanya Swamy Temple
Importance of Skandagiri Subrahmanya Swamy Temple

సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుండి 2 కిలోమీటర్ల దూరంలో గల పద్మారావు నగర్‌లో గల శ్రీ వల్లిసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేవాలయం ఎంతో శక్తి వంతమైనది మరియు మహిమాన్వితమైనది. ఈ దేవాలయ ప్రాంగణంలో మహాగణపతి శ్రీ ఏకాంబరేశ్వర, కామాక్షిదేవిలతో విరాజిల్లుతున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరుడు, కార్తికేయుడు, మురుగన్, స్కందుడు, కుమారస్వామి ..ఇలా ఒక్కో ప్రాంతంలో ఒక్కో పేరుతో స్వామివారిని అర్చిస్తారు. కుమార స్వామి కారణజన్ముడనీ తారకాసురుణ్ణి వధించడం కోసమే పుట్టాడనేది పురాణ కథనం. స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని కుమార షష్టిని కూడా కార్తికేయ సుబ్రహ్మణ్య షష్ఠి, కుక్కే సుబ్రహ్మణ్య షష్ఠి, స్కంద షష్ఠి…ఇలా వివిధ రకాల పేర్లతో పిలుస్తారు. అందులో భాగంగానే సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ లో ఉన్న స్కందగిరి ఆలయంలో జరిపే పర్వదినాన్ని స్కంద షష్ఠిగా చెబుతారు. ఆగమన శస్త్ర పద్ధతిలో పూజలు జరిపించడం ఈ ఆలయం ప్రత్యేకత ఆగమ శాస్త్ర పద్ధతిలో పూజలు జరిపించడం ఈ ఆలయం ప్రత్యేకత. నిష్ఠతో ఆరాధిస్తే కోరిన కోరికలన్నీ తీరతాయన్న నమ్మకంతో నిత్యం ఈ ఆలయాన్ని అనేకమంది సందర్శిస్తారు. షష్ఠి పర్వదినం నాడైతే వేలకొద్దీ భక్తులు తరలి వచ్చి పూజలు జరిపిస్తారు.

స్థల పురాణం

స్థానికంగా ఉండే ఓ భక్తుడికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారు కలలోకి కనబడి గుడిని కట్టాలని ఆదేశించారు. ఆయన సికింద్రాబాద్ లోని పద్మారావునగర్ లో ఆంజనేయుడి విగ్రహం ఉన్న ఎత్తైన కొండమీద స్కందుడి ఆలయానికి దాతల సహాయంతో శ్రీకారం చుట్టారు. ఆ తర్వాత దీన్ని కంచి పీఠానికి అప్పగించగా, నాటి కంచి పీఠాధిపతి చంద్రశేఖరస్వామి శంకరమఠం పేరుతో ఆ ఆలయాన్ని ప్రారంభించారు. స్కందగిరిగా నామకరణం అప్పటి నుండీ ఈ ఆలయం మఠం నిర్వహాణలోనే కొనసాగుతోంది. ఆ తర్వాత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి అష్టోత్తర పూజలో వచ్చే ఓం స్కందాయేనమఃఅనే మంత్రంలోని స్కందఅన్న పదానికి , కొండమీద ఆలయాన్ని నిర్మించిన కారణంతో గిరి అనే పదాన్నీ చేర్చి స్కందగిరిగా నామకరణం చేశారు.

Importance of Skandagiri Subrahmanya Swamy Temple
Importance of Skandagiri Subrahmanya Swamy Temple

ఆలయ ప్రత్యేకతలు

ఈ ఆలయంలో ప్రధాన మూలవిరాట్టు సుబ్రహ్మణ్యస్వామియే అయినప్పటికీ భక్తుల దర్శనార్థం అనేక ఉప ఆలయాలను కూడా నిర్మించారు. సుందర గణపతి, ప్రసన్నాంజనేయుడు, శివుడు, మీనాక్షి, దక్షిణామూర్తి లింగోద్భవ, బ్రహ్మ, చండికేశ్వరుడు, గోవిందరాజులు, శ్రీదేవి, భూదేవి దుర్గామాత నటరాజ ఆలయం , బయట రాగి చెట్టుకు కింద నాగదేవతలు, షణ్ముఖ, నవగ్రహాలు, రాహుకేతువులు, కదంబ దేవతల ఆలయాలతో పాటు ఆదిశంకరాచార్యుల పాదుకులను ఏర్పాటు చేశారు. ఆలయంలోని అన్ని దేవతామూర్తులకు నిత్య పూజలు జరుగుతాయి.

సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ప్రతి మంగళవారం అభిషేకం చేయించి, ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేస్తే కోరిన కోరికలు తీరుతాయనేది భక్తుల నమ్మకం. ఈ ఆలయంలో స్కంద షష్ఠిని ఘనంగా నిర్వహించడంతో పాటు, సంవత్సరంలో రెండుసార్లు స్వామివారికి కళ్యాణోత్సవాన్ని, కావడి పూజలనీ నిర్వహిస్తుంటారు. ఈ దేవాలయంలో 51 లేదా 101 ప్రదక్షిణలు 51 లేదా 101 ప్రదక్షిణలు చేస్తే గ్రహదోషం పోతుందనీ, సంతానంలేని వారికి సంతానం కలుగుతుందనీ, రుణవిమోచన కలుగుతుందనీ ఈ దేవాలయాన్ని సందర్శించే భక్తులు విశ్వసిస్తుంటారు. ప్రతి మంగళవారం మహిళలు మధ్యాహ్నం ప్రతి మంగళవారం మహిళలు మధ్యాహ్నం మూడు గంటల నుంచి నాలుగున్నర వరకు నిమ్మకాయలను కోసి, వాటిని వెనక్కి తిప్పి అందులో నూనె పోసి దీపాలు వెలిగిస్తారు. అలా చేయడంవల్ల కుటుంబ బంధాలు మెరుగుపడతాయనీ, పెళ్లిళ్లు కుదురుతాయనీ భార్యాభర్తలు అన్యోన్యంగా ఉంటారనీ విశ్వసిస్తారు

. చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే శివధ్యానంలో ఉన్న చండికేశ్వరుడి విగ్రహం వద్ద భక్తులు చప్పట్లు కొట్టి తమ కోరికలను విన్నవించుకుంటే అవి నెరవేరతాయని ప్రతీతి. స్కందగిరి ఆలయంలో శివపార్వతులకు అత్యంత ప్రీతికరమైన కార్తీక మాసంలో శివుడికి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. మహాన్యాస పూర్వక రుద్రాభిషేకాన్ని, హోమాలను చేస్తారు. ప్రత్యేక అలంకరణలతో యాగశాలను రూపొందించి, 108 రుత్వికులు మహాన్యాస పారాయణంతో హోమాన్ని చేస్తారు. ఏటా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ చక్కెరపొంగలి, పులిహోర, పంచామృతం, కట్టుపొంగలి, వడలు, దధ్యోదనం తదితర ప్రసాదాలకీ ఈ ఆలయం పెట్టింది పేరు. ఏటా ఈ ఆలయంలో బ్రహ్మోత్సవాలను నిర్వహించడం ఆనవాయితీ. సికింద్రాబాద్‌లో ఉన్న ఈ ఆలయానికి ఏ ప్రాంతం నుంచైనా చేరుకోవచ్చు.

ఆలయ దర్శించడానికి సమయాలు

సోమ, బుధ, గురు, శని వారాల్లో ఉదయం 6 గంటల నుండి 11వరకు తిరిగి సాయంత్రం 4.30గంటల నుండి 9గంటల వరకు తెరవబడను. మంగళవారం ఉదయం 6 గంటల నుండి మధ్యహ్నాం 12గంటలకు తిరిగి సాయంత్రం 3 నుండి రాత్రి 9వరకు తెరవబడును. ఇక శుక్ర, ఆదివారాల్లో ఉదయం 6 గంటల నుండి 12pm వరకు సాయంత్రం 4.30 నుండి రాత్రి 9 వరకు తెరుస్తారు. ఇక పండగ పర్వ దినాల్లో సమయంలో మార్పులు ఉంటాయి. పూర్తి వివరాలు ఆలయ వెబ్‌సైట్‌లో కూడా లభిస్తాయి.

– కేశవ

Read more RELATED
Recommended to you

Latest news