టార్గెట్ ఆల్టర్నేటివ్: ఆందోళనకోసం అధ్యయనం దిశగా బీజేపీ – జనసేన!

-

హస్తినలో పరిస్థితి ఎలా ఉందో తెలియదు కానీ.. ఏపీలో బీజేపీ మాత్రం ప్రతిపక్ష పాత్ర విషయంలో సీరియస్ గానే ముందుకు కదులుతున్నట్లు కనిపిస్తుంది. గడిచిన కొన్ని రోజులుగా టీడీపీ నేతలనుంచి రెగ్యులర్ రాజకీయ విమర్శలే తప్ప మరో కనస్ట్రక్టివ్ విమర్శలు లేవనే వాదనలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ క్రమంలో బీజేపీనేతలు ఒకడుగు ముందుకేసి.. ప్రభుత్వాన్ని టార్గెట్ చేసి, వైకాపాకు ఆల్టర్నేటివ్ బీజేపీ అనే సంకేతాలు పంపేలా కృషిచేస్తున్నారు!


దేశం మొత్తం మీద కరోనా విషయంలో ఆంధ్రప్రదేశ్ చాలా చాకచక్యంగా వ్యవహరిస్తుందని.. చాలా దూకుడుగా నిర్ణయాలు తీసుకుంటుందని.. కరోనా ఎఫెక్ట్ పరిపాలనపై పడకుండా చూసుకుంటుందని.. వార్తలొస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో… దేశం మొత్తం మీద కరోనా విషయంలో అన్ లాక్ అనే పేరుచెప్పి చేతులెత్తేసి.. ఆ నష్టాన్ని ప్రజలనుంచే వసూలు చేయాలనే ఉద్దేశ్యంతో వరుసగా సుమారు మూడు వారాలపాటు రోజూ పెట్రోల్, డీజిల్ ధరలు పెంచుకుపోయిన కేంద్ర ప్రభుత్వంపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కరోనా విషయంలో ఏపీ ప్రభుత్వం సరిగా పనిచేయడం లేదని విమర్శలు గుప్పిస్తున్నారు ఏపీ బీజేపీ నేతలు!

తాజాగా బీజేపీ – జనసేన పార్టీ కీలక నేతలు ఒక సమావేశాన్ని ఏర్పాటుచేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ, జనసేన నేతలు మాట్లాడుతూల్… కరోనా పరీక్షల సంఖ్య పెరిగినప్పటికీ వేగంగా విస్తరిస్తున్న వ్యాధిని నివారించడంలో రాష్ట్ర ప్రభుత్వం సమర్థంగా పని చేయడం లేదని.. వ్యాధి నివారణలో క్షేత్ర స్థాయిలో పని చేస్తున్న డాక్టర్లు, వైద్య సిబ్బంది రక్షణలో సర్కారు వైఫల్యం క్లియర్ గా కనిపిస్తోందని ఆరోపించారు! కాబట్టి ఈ విపత్కాలంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రకటించిన ఆత్మ నిర్భర భారత్ పథకం ఆంధ్రప్రదేశ్ లో ఏ విధంగా అమలు అవుతుందో అధ్యయనం చేసి.. అనంతరం ఆ అంశంపై ఆందోళనలు చేయాలని నిర్ణయించుకున్నారట!

అడ్డదిడ్డంగా ఆరోపణలు చేయడం కంటే.. పాతచింతకాయ పచ్చడి విమర్శలతో ఊకదంపుడు ఉపన్యాశాలు ఇవ్వడం కంటే… నిజంగా రాష్ట్రంలో అధ్యయనం చేసి అనంతరం విమర్శలు చేస్తే అంతా హర్షిస్తారని అంటున్నారు విశ్లేషకులు!! ఈ లెక్కన చూసుకుంటే… బీజేపీ – జనసేన ద్వయం ఏపీలో రాజకీయాలు సీరియస్ గానే చేయాలని ఫిక్సయినట్లున్నాయని పలువురు అభిప్రాయపడుతున్నారు! అయితే వీరి జంట.. టీడీపీకి ఆల్టర్నేటివా.. అధికార వైకాపా కు ఆల్టర్నేటివా అనేది తెలియాలంటే ఇంకాస్త సమయం వేచి చూడాలి!

Read more RELATED
Recommended to you

Latest news