త్వరలోనే రెండో వివాహం పై క్లారిటీ ఇస్తానన్న అమలాపాల్..!!

-

అమలాపాల్.. తెలుగు ప్రేక్షకుల కలల రాణి అని చెప్పవచ్చు. చూడ చక్కని అందం.. కాటుక లాంటి కళ్ళు.. వయ్యారాల సోయగాలు పండించే ఈ ముద్దుగుమ్మ కోసం కుర్రకారు కూడా క్యూ కడుతున్నారు అని చెప్పడంలో సందేహం లేదు. మలయాళం సినీ ఇండస్ట్రీకి చెందిన ఈ కేరళ కుట్టి తన అందంతో ప్రేక్షకులను మెస్మరైజ్ చేస్తోంది. తెలుగు సినీ ఇండస్ట్రీలో చేసింది కొన్ని సినిమాలే అయినా అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్ ను సొంతం చేసుకుంది అమలాపాల్. ఇకపోతే అమలాపాల్ మొదటిసారి నీల తామర అనే మలయాళం సినిమా ద్వారా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన ఈమె మైనా సినిమాతో మంచి గుర్తింపును తెచ్చుకుంది. ఆ తర్వాత తమిళ్లో కూడా పలు సినిమాలు చేసి మంచి ఫ్యాన్ బేస్ ను సొంతం చేసుకున్న ఆ తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది.

ప్రేమఖైదీ అనే సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన ఈ అమ్మడు.. నాగచైతన్య సరసన బెజవాడ సినిమాతో మరింత పాపులారిటీని సొంతం చేసుకుంది. ఇక అల్లు అర్జున్ సరసన ఇద్దరమ్మాయిలు.. నాని సరసన జెండాపై కపిరాజు వంటి సినిమాలలో నటించి ఒక క్రేజ్ ను ఏర్పాటు చేసుకుంది. ఇకపోతే కెరియర్ పీక్స్ లో ఉండగానే 2015లో తమిళ్ ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ దర్శకుడుని వివాహం చేసుకుంది అమలాపాల్ . కానీ ఆ పెళ్లి మూడు నాళ్ళ ముచ్చటే అన్నట్లుగా మూడు సంవత్సరాలు కూడా ముగియకుండానే ఇతర కారణాల వల్ల ఇద్దరూ విడిపోయారు.

ఇకపోతే ఎవరు పనుల్లో వాళ్ళు బిజీ అవ్వగా .. ప్రస్తుతం అమలాపాల్ పలు వెబ్ సిరీస్లో చేస్తూ చాలా బిజీగా తన కెరీర్ ను గడుపుతోంది. ఇక సోషల్ మీడియా ద్వారా ప్రేక్షకులకు ఎప్పుడు దగ్గరగా ఉండే అమలాపాల్ ఇటీవల తన అభిమానులతో లైవ్ చిట్ చాట్ జరిగింది. ఈ క్రమంలోనే మీరు వివాహం చేసుకోబోయే అబ్బాయి లో ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి అనే ప్రశ్న ఎదురువగా అమలాపాల్ మాట్లాడుతూ.. ఇప్పుడిప్పుడే నన్ను నేను స్ట్రాంగ్ చేసుకునే పనిలో ఉన్నాను. త్వరలోనే కాబోయే భర్త యొక్క క్వాలిటీస్ వెల్లడిస్తాను అంటూ అమలాపాల్ సమాధానం ఇచ్చింది. దీన్ని బట్టి చూస్తే ఆమె త్వరలోనే ఇంకో వివాహం చేసుకోబోతుందని తెలుస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news