జమ్మూకశ్మీర్ వర్షం బీభత్సం సృష్టించింది. గత మూడు రోజులుగా అక్కడ కుంభవృష్టిగా వర్షాలు కురుస్తున్నాయి. చార్ ధామ్ యాత్రలో భాగంగా నిర్వహించే అమర్ నాథ్ యాత్రపై వరుణుడు పంజా విసిరాడు. జమ్మూకశ్మీర్ లోని అనంతనాగ్ జిల్లాలోని అమర్ నాథ్ క్షేత్రం వద్ద భారీ వర్షం కురిసింది. దాంతో ఆలయ పరిసరాలు వరదలు పోటెత్తాయి. దీంతో.. ఒక్కసారిగా వరద నీరు పెరిగిపోవడంతో పలువురు భక్తులు అందులో చిక్కుకున్నారు.
పక్కనే ఉన్న గుహ చుట్టు పక్కల 12 వేల మంది వరకు భక్తులు ఉన్నట్టు తెలుస్తోంది.వారిలో కొందరి ఆచూకీ తెలియరాలేదు. వేలమంది భక్తులు వరద ప్రభావానికి గురైనట్టు భావిస్తున్నారు అధికారులు. అయితే.. ఇప్పటివరకు 15 మంది మృతి చెందినట్టు అధికారులు గుర్తించారు.అయితే మరోవైపు బిజెపి ఎమ్మెల్యే రాజాసింగ్ కు త్రుటిలో ప్రమాదం తప్పింది.
అరగంట తేడాతో ప్రమాదం నుండి బయటపడ్డానని రాజాసింగ్ తెలిపారు.” నేను నా కుటుంబ సభ్యులు క్షేమంగానే ఉన్నాం. మూడు రోజులుగా అమర్నాథ్ లో వర్షం పడుతూనే ఉంది. వాతావరణం బాగా లేకపోవడంతో హెలిక్యాప్టర్ బదులుగా గుర్రాలపై ప్రమాదానికి అరగంట ముందుగా వెళ్ళిపోయాం. గృహ దగ్గర వేల మంది నిలబడ్డారు. మా ముందే 50 టెంట్లు కొట్టుకుపోయాయి”. అని బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ తెలిపారు.