హిందూ ధర్మంలో సూర్య భగవాణుడికి చాలా ప్రాముఖ్యత ఉంది. ఆయనతోనే మన జీవితం ముడిపడి ఉన్నది. అందుకే ఆ స్వామి ఆరాధన పూర్వం నుంచి మన పూర్వీకులు చేస్తున్నారు. సూర్యుని రధానికి గుర్రాలు ఏడు. ఇవి ఇంద్రధనుస్సు లోని రంగులుగా, వారంలోని ఏడు రోజులుగా భావించవచ్చు. సూర్యుని రధచక్రాలకు గల ఆకులు పన్నెండు. వీటిని ఒక సంవత్సరం లోని పన్నెండు నెలలుగా లేదా పన్నెండు రాశులుగా భావించవచ్చును. సూర్యుడు నమస్కార ప్రియుడు అని పేరు. ఆయనకు నమస్కారం పెడితే చాలు అని శాస్త్రవచనం. ఈ సూర్య నామాలు చదువుతూ ఆ భగవానున్ని మోక్కితే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలుగుతాయని శాస్త్రం చెబుతోంది.
ప్రతీ రోజు ఉదయం స్నానం చేసిన తరువాత సూర్య భగవాణుడివైపు (తూర్పు) తిరిగి ఈ క్రిందినామాలను అమర కోశాంతర్గత సూర్య నామాలు చదవడం వలన మంచి ఆరోగ్యంతోపాటు మంచి ఐశ్వర్యం కూడా కలుగుతుంది.
అమర కోశాంతర్గత సూర్య నామాలు
- సూరాయ నమః
- సూర్యాయ నమః
- అర్యమ్ణే నమః
- ఆదిత్యాయ నమః
- ద్వాదశాత్మనే నమః
- దివాకరాయ నమః
- భాస్కరాయ నమః
- అహస్కరాయ నమః
- బ్రధ్నాయ నమః
- ప్రభాకరాయ నమః
- విభాకరాయ నమః
- భాస్వతే నమః
- వివస్వతే నమః
- సప్తాశ్వాయ నమః
- హరిదశ్వాయ నమః
- ఉష్ణరశ్మయే నమః
- వికర్త నాయ నమః
- అర్కాయ నమః
- మార్తండాయ నమః
- మిహిరాయ నమః
- అరుణాయ నమః
- పూష్ణే నమః
- ద్యుమణయే నమః
- తరణయే నమః
- మిత్రాయ నమః
- చిత్ర భానవే నమః
- విరోచనాయ నమః
- విభావసవే నమః
- గ్రహ పతయే నమః
- త్విషాం పతయే నమః
- అహర్పతయే నమః
- భానవే నమః
- హంసాయ నమః
- సహస్రాంశవే నమః
- తపనాయ నమః
- సవిత్రే నమః
- రవయే నమః
– ఇంద్రకంటి ప్రమోద్ కుమార్ శర్మ
స్మార్థ భట్టారక