అమరావతి రైతుల మహాపాదయాత్ర నేటితో 14 వ రోజుకు చేరుకుంది. అమరావతిని రాజధానిగా ప్రకటించాలంటూ రైతులు చేపట్టిన మహా పాదయాత్రకు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. పాదయాత్రకు సంఘీభావం ప్రకటిస్తూ.. మూడు రాజధానులు వద్దు.. అమరావతి ముద్దు అంటూ నినదించారు. మహా పాదయాత్ర సాగుతున్న మార్గంలో ప్రజలు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ప్రజలుపాల్గొంటున్నారు. నేడు కృష్ణాజిల్లా గుడివాడ సమీపంలోని నాగవరప్పాడు నుండి పాదయాత్రను ప్రారంభించారు.
ఈ పాదయాత్రలో టిడిపి నాయకులు దేవినేని ఉమ, రావి వెంకటేశ్వరరావు, అఖిలపక్ష ఐక్య కార్యాచరణ సమితి నాయకులు, మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. సీఎం జగన్ అమరావతిని రాజధానిగా ఉంచి అభివృద్ధి చేస్తే మరోసారి గెలిపించుకుంటామని అన్నారు. ఈ పాదయాత్ర మధ్యాహ్నానికి ఏలూరు జిల్లాలోకి ప్రవేశించనుంది.