కొత్త సంవత్సరం ఆదిలోనే జనసేనకు బిగ్ షాక్ తగలనుంది. జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ పై తుళ్లూరు పోలీసులు కేసు నమోదు చేయనున్నట్టు సమాచారం. మంగళవారం రాజధాని గ్రామాల్లో పర్యటించిన వపన్ సెక్షన్ 144, 30లను బ్రేక్ చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. అంతేకాకుండా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని కూడా వారు చెబుతున్నారు. దీంతో జనసేనాననిపై కేసు పెడతామని పోలీసులు చెబుతున్నారు. మంగళవారం అమరావతి గ్రామాల్లో పర్యటించిన పవన్ కల్యాణ్‌ను పోలీసులు అడ్డుకున్నారు.
మందడం వెళ్లే దారిలో పవన్‌ను పోలీసులు అడ్డగించారు. కృష్ణయపాలెం నుంచి మందడం మీదుగా వెళ్తున్న పవన్‌ను పోలీసులు అడ్డు తగిలారు. వెంకటపాలెం చెక్ పోస్టు వద్ద పవన్ ను పోలీసులు నిలిపివేశారు. సచివాలయంలో సీఎం ఉన్నందున.. సీఎం వెళ్లాకే మందడం గ్రామంలోకి అనుమతిస్తామన్నారు. లేకుంటే నేరుగా తుళ్లూరు వెళ్లాలని సూచించారు. దీంతో పవన్ నేలపైన కూర్చొని పోలీసుల తీరుకు నిరసనకు దిగిన విషయం తెలిసిందే.