ఢిల్లీ పర్యటనలో ఉన్న సీఎం చంద్రబాబు నాయుడు మీడియా చిట్ చాట్‌లో ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. కేంద్రం నుంచి ఎలాంటి పదవులు ఆశించలేదని సీఎం అన్నారు.గతంలో ఎన్డీఏ ప్రభుత్వం వాజ్‌పేయి నేతృత్వంలో ఉన్నప్పుడు కూడా ఎలాంటి పదవులు ఆశించలేదని, అప్పుడు 7 మంత్రి పదవులు తీసుకోవాలని కోరినా అంగీకరించలేదని తెలిపారు.
ఎన్డీఏ పార్టీలతో సత్సంబంధాల కోసమే స్పీకర్ పదవికి మాత్రం అంగీకరించానని ఆయన తెలిపారు.ఇప్పుడు కూడా అదే తరహాలో ఎలాంటి పదవులు తెలుగుదేశం పార్టీ నుంచి కోరలేదని, అయితే ఎన్డీఏ నుంచి ఆఫర్ చేసిన రెండు మంత్రి పదవులు మాత్రం తీసుకున్నామనితె లిపారు.కేంద్రం ఇచ్చిన మంత్రి పదవుల పట్ల సంతోషంగానే ఉన్నామని అన్నారు.గత 5 సంవత్సరాలలో జగన్ పాలనతో అమరావతిపై ఉన్న ఆకర్షణ కొంతవరకు తగ్గిందని ఆయన వ్యాఖ్యానించారు. అమరావతికి కోల్పోయిన ఆకర్షణను తిరిగి తీసుకురావడమే ప్రధాన ధ్యేయంగా పని కొనసాగుతోందన ఆయన తెలిపారు. 135 ప్రభుత్వ కార్యాలయాలు అమరావతిలో ఏర్పాటు కాబోతున్నాయని ,అమరావతికి అవసరమైన ప్రాథమిక మౌలిక వసతులన్నీ కల్పిస్తామని వెల్లడించారు. త్వరలోనే ఐకానిక్ బిల్డింగ్స్ సహా అన్ని కార్యాలయాల నిర్మాణాలను పూర్తి చేయబోతున్నామని తెలిపారు.