ఆశ్చర్యపరుస్తున్న ప్రభాస్ ఫోటో.. నెట్టింట ట్రోల్స్..!

-

ఆరడుగుల కటౌట్ తో ఆజానుబాహుడు లాగా కనిపించే ప్రభాస్ అంటే పడి చచ్చే అమ్మాయిలు ఎంతోమంది ఉన్నారు. స్టార్ సీనియర్ హీరోయిన్లు కూడా ప్రభాస్ తో నటించాలి అని ఆయనతో ఒక్క సీన్లో కనిపిస్తే చాలు అని ఆరాటపడేవారు చాలామంది ఉన్నారు. ముఖ్యంగా పాన్ ఇండియా స్టార్ గా అవతరించిన తర్వాత డార్లింగ్ భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ముఖ్యంగా సోషల్ మీడియాలో ప్రభాస్ ఫ్యాన్స్ సందడి కూడా ఎక్కువే ఉంటుంది. ఇప్పటికీ కూడా పలు భారీ ప్రాజెక్టు సినిమాలతో బిజీగా ఉన్న ఈయనపై ఆది పురుష్ సినిమాతో ట్రోలింగ్ మొదలైంది. ప్రభాస్ లుక్ ఆకర్షణీయంగా లేకపోవడంతో గతంలో ఆయనపై విమర్శలతో పాటు ట్రోలింగ్ కూడా మొదలైంది.

ఇక అప్పట్నుంచి ఇప్పటివరకు ఏదో రకంగా ప్రభాస్ లుక్ పై కామెంట్లు వినిపిస్తూనే ఉన్నాయి. అయితే ఇప్పుడు తాజాగా ప్రభాస్ కు సంబంధించిన ఒక ఫోటో సోషల్ మీడియాలో చాలా వైరల్ గా మారుతోంది. సౌత్ ఫిలిం ఇండస్ట్రీ లెజెండ్ రజినీకాంత్ , శివరాజ్ కుమార్ తో ప్రభాస్ కలసి ఫోజులిస్తుండడం ఇప్పుడు వైరల్ గా మారింది. అయితే ఆ ఫోటో ఖచ్చితంగా మార్ఫింగ్ చేసినట్టు కనిపిస్తోంది. అతను ప్రభాస్ కాదు.. ఇది ఫేక్ పిక్ కదా? అనే కామెంట్స్ చేస్తున్నారు . ప్రభాస్ ఎక్కువగా మద్యం తాగారా? అని కూడా కామెంట్లు వినిపిస్తున్నాయి. ఈ ఫోటో చూస్తే నిజంగా ప్రభాస్ యేనా అన్న ఆశ్చర్యం కలగక మానదు.

కానీ ఎవరో కొంతమంది కావాలని ఇలా ఆయన పరువుకు భంగం కలిగించే విధంగా ఫోటోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో షేర్ చేయడం ఎప్పుడు సంచలనానికి దారి తీస్తోంది.ఇక ప్రభాస్ సినిమాల విషయానికి వస్తే స్పిరిట్, ప్రాజెక్టుకే, సలార్, ఆది పురుష్ వంటి సినిమాలతో బిజీగా ఉన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news