రూ.999 అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌.. కేవ‌లం రూ.500ల‌కే.. అమెజాన్ బంప‌ర్ ఆఫ‌ర్‌..!

357

అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ పొందాలంటే ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం అమెజాన్ కేవ‌లం రూ.500 కే ఈ ఆఫ‌ర్‌ను అందిస్తోంది.

ప్ర‌ముఖ ఈ-కామ‌ర్స్ సంస్థ అమెజాన్ అందిస్తున్న ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ద్వారా ఎన్ని ప్ర‌యోజ‌నాలు ఉంటాయో అంద‌రికీ తెలిసిందే. ఓ వైపు వెబ్‌సైట్‌లో కొనే వ‌స్తువుల‌ను ఉచితంగా, వేగంగా డెలివ‌రీ అందుకోవ‌చ్చు. మ‌రోవైపు అమెజాన్ ప్రైమ్ వీడియో యాప్‌లో సినిమాలు, టీవీ షోలు, ఇత‌ర వీడియోల‌ను ఉచితంగా చూడ‌వ‌చ్చు. దీంతో చాలా మంది ప్రైమ్ మెంబ‌ర్లుగా చేరుతున్నారు. అయితే అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ పొందాలంటే ఏడాదికి రూ.999 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్ర‌స్తుతం అమెజాన్ కేవ‌లం రూ.500 కే ఈ ఆఫ‌ర్‌ను అందిస్తోంది.

అమెజాన్ సంస్థ త‌న వెబ్‌సైట్‌లో ఈ నెల 15, 16 తేదీల్లో ప్రైమ్ డే సేల్ నిర్వ‌హించ‌నుంది. అందులో భాగంగా అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్లు అనేక ప్రొడ‌క్ట్స్‌పై ఆక‌ట్టుకునే రాయితీలు, ఆఫ‌ర్ల‌ను పొంద‌వ‌చ్చు. అయితే ఈ సేల్‌లో భాగంగా మ‌రొక ఆఫ‌ర్‌ను కూడా అమెజాన్ అందిస్తోంది. కేవ‌లం రూ.500 చెల్లిస్తే చాలు.. వినియోగ‌దారులు అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ పొంద‌వ‌చ్చు. అందుకుగాను వారు సేల్ స‌మ‌యంలో ఆ మొత్తాన్ని చెల్లించి ప్రైమ్ మెంబర్‌షిప్ తీసుకోవాల్సి ఉంటుంది.

అయితే అమెజాన్.. ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌పై అందిస్తున్న ఈ డిస్కౌంట్‌ను పొందాలంటే వినియోగ‌దారుల ఏజ్ 18 నుంచి 24 ఏళ్ల మ‌ధ్య ఉండాలి. ఆ వ‌య‌స్సు ఉన్న‌వారికే ఈ ఆఫ‌ర్ కింద కేవ‌లం రూ.500 కే ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ ఇస్తారు. ఇక ఈ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్ తీసుకున్న‌వారికి 50 శాతం క్యాష్‌బ్యాక్ వ‌స్తుంది. అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్ షిప్‌ను రూ.500కే పొందాల‌నుకునే వారు యాప్‌లో ఉండే యూత్ ఆఫ‌ర్‌పై క్లిక్ చేసి రూ.999 చెల్లించాలి. చిరునామా, పాన్ కార్డు, ఫొటో అప్‌లోడ్ చేసి వ‌య‌స్సును ధ్రువీక‌రించే ప‌త్రాల‌ను అప్‌లోడ్ చేయాలి. దీంతో ఆ వివ‌రాల‌ను వెరిఫై చేశాక 10 రోజుల్లో రూ.500 క్యాష్‌బ్యాక్‌ను అమెజాన్ త‌న అమెజాన్ పే వాలెట్‌లో జ‌మ చేస్తుంది. దీంతో స‌గం ధ‌ర‌కే అమెజాన్ ప్రైమ్ మెంబ‌ర్‌షిప్‌ను పొందినట్లు అవుతుంది..!