చంద్రబాబుకు మతి భ్రమించింది..భ్రష్టు పట్టిపోతారు :అంబటి

ఏపీలో జరుగుతున్న వరుస విగ్రహం ధ్వంసం ఘటనల మీద వైసీపీ ఎమ్మెల్యే అంబటి రాంబాబు ప్రెస్ మీట్ ఏర్పాటు చేసి చంద్రబాబు మీద టీడీపీ మీద అనేక ఆరోపణలు చేశారు. కొన్ని రోజుల నుంచి రాజకీయాన్ని మతం చుట్టూ తిప్పుతూ లబ్ది పొందాలని కొన్ని పార్టీలు ప్రయత్నిస్తున్నాయన్న ఆయన టీడీపీ, బీజేపీ, జనసేన, వారి అనుబంధ పార్టీలు గత ఎన్నికల్లో ఘోర ఓటమి పాలయ్యాయని అన్నారు. వీళ్ళందరూ ఇప్పుడు మా ప్రభుత్వం హిందూ వ్యతిరేకిగా బురద వేసే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు.

టిని ప్రజలు నమ్మవద్దని విఙప్తి చేస్తున్ననాని అన్నారు. చంద్రబాబు తనను తాను హిందూ మతద్ధోరకుడిగా కొత్త అవతారం ఎత్తుతున్నారన్న ఆయన బాబుకు మతి భ్రమించిందని అన్నారు. అమరావతి గురించి ఇవాళ గొప్పగా మాట్లాడుతున్న చంద్రబాబు అమరేశ్వరుడిని కాకుండా బుద్ధుని పటాలు ఎందుకు పెట్టుకున్నారని ప్రశ్నించారు. దేవుడిని అడ్డం పెట్టుకుని రాజకీయాలు చేస్తే దేవుడు క్షమించడు…భ్రష్టు పట్టుకుని పోతారంటూ శాపనార్థాలు పెట్టారు.