చంద్రబాబు ఎజెండా ప్రకారం నిమ్మగడ్డ రమేష్ రాష్ట్ర పర్యటన ఉందని అంబటి రాంబాబు విమర్శించారు. తన వ్యక్తిగత కోరికలు, కక్షలు తీర్చుకోవడానికి నిమ్మగడ్డ జిల్లాల పర్యటన చేస్తున్నారని ఆయన మాటలను బట్టి అర్థం అవుతుందని అన్నారు ఆయన. టీడీపీ ప్రధాన కార్యదర్శిగా వ్యవహరిస్తున్న తీరు చూసి ప్రజలు ఛీ కొడుతున్నారని ఆయన అన్నారు. నిమ్మగడ్డ ఎస్ఈసీ గా కాదు పచ్చి రాజకీయ వాదిగా వ్యవహరిస్తున్నారని ఆయన విమర్శించారు.
నిమ్మగడ్డ ఎర్రగడ్డకు వెళ్ళాలో, ఇంకో చోటికి వెళ్ళాలో నిర్ణయించుకోవాలన్న ఆయన వైఎస్సార్ విగ్రహాలకు ముసుగులు కప్పుతున్న నిమ్మగడ్డ….మళ్ళీ వైఎస్సార్ ను పొగడుతున్నాడు…తనకు నిబంధనలు వర్తించవా? అని ప్రశ్నించారు. మీడియా గట్టిగా ఉంటేనే ప్రజాస్వామ్యం బలంగా ఉంటుందన్న నిమ్మగడ్డ మరి జర్నలిస్ట్ లకు ప్రశ్నలను అడిగే అవకాశం ఎందుకు ఇవ్వడం లేదు? అని ప్రశ్నించారు. నిమ్మగడ్డ రాజ్యాంగ శక్తి కాదు రాజకీయ వ్యాపారని ఆయన విమర్శించారు.