Breaking : రాజకీయాల్లోకి అంబటి రాయుడు.. ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం

-

ప్రస్తుతం క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన అంబటి రాయుడురాజకీయాల్లోకి వస్తున్నారని ప్రచారం జరిగింది. అలా జరిగినట్టుగానే ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డితో రెండు సార్లు భేటీ అయ్యారు. దీంతో ఆయన గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తారనే ప్రచారం రాష్ట్రవ్యాప్తంగా మారుమోగిపోయింది. అయితే ఆ ప్రచారంపై ఇప్పటివరకూ వరకూ స్పందించని ఆయన తాజాగా గుంటూరు జిల్లా ఫిరంగిపురంలో సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎంతో భేటీ అయినప్పుడు రాజకీయాలు మాట్లాడలేదని చెప్పారు. కానీ ప్రజలకు సేవ చేస్తానని స్పష్టం చేశారు. అది ఏ ఫ్లాట్ ఫామ్ అనేది త్వరలో చెబుతానని పేర్కొన్నారు. గుంటూరు నుంచి ఎంపీగా పోటీ చేస్తాననేది ఊహాగానమేనని చెప్పారు. క్షేత్ర సాయిలో ప్రజా, రైతు సమస్యలు తెలుసుకుంటున్నానని మాజీ క్రికెటర్ అంబటి రాయుడు స్పష్టం చేశారు.

YSRCP Begins Kamma - Kapu Drama Using Ambati Rayudu!

అంబటి రాయుడు గుంటూరు జిల్లా ఫిరంగిపురం మండలంలో మంగళవారం పర్యటించారు.పర్యటనలో భాగంగా అమీనాబాద్ లోని మూలంకరీశ్వరి దేవి అమ్మవారి ఆలయంలో, ఫిరంగిపురం సాయిబాబా దేవాలయంలో, ఫిరంగిపురం బాల యేసు చర్చిలో పూజలు, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. మార్నింగ్ స్టార్ కళాశాల విద్యార్థులతో కలసి విద్యార్థులకు పలు సూచన చేశారు.ఈ సందర్భంగా అంబటి రాయుడు మాట్లాడుతూ ఈరోజు మా అమ్మగారి పుట్టిన గ్రామానికి వచ్చినందుకు సంతోషంగా ఉంది, విద్యార్థులు ఉన్నత స్థాయిలో ఉన్న వారిని ఆదర్శంగా తీసుకొని కష్టపడి చదివి ఉన్నత స్థానంలో నిలవాలని అన్నారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news