ఈ రోజు వన్ డే వరల్డ్ కప్ 2023 షెడ్యూల్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. గతంలో 2011 లో ఇండియాలో వరల్డ్ కప్ జరిగింది, అందులో ఇండియా ధోని సారధ్యంలో టైటిల్ ను గెలుచుకుంది. ఇప్పుడు దాదాపు 12 సంవత్సరాల అనంతరం ఇండియాలో జరుగుతుండడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ఈ సందర్భంగా టీం ఇండియా కెప్టెన్ రోహిత్ శర్మ కొన్ని కామెంట్స్ చేశాడు. రోహిత్ మాట్లాడుతూ ఈసారి వరల్డ్ కప్ మాములుగా ఉండదు. ప్రతి మ్యాచ్ కూడా హోరా హోరీగా జరుగుతుంది అంటూ ఇప్పటి నుండే ప్రేక్షకులకు ఆసక్తిని రేకెత్తించే ప్రయత్నం చేశాడు. సొంత గడ్డపై ఆడుతుండడం చాలా మంచి ఫీలింగ్ అని రోహిత్ అన్నాడు. నేను నా వంతు వీలైనన్ని ఎక్కువ పరుగులు జట్టుకు ఉపయోగపడేలా చేయడానికి ప్రయత్నిస్తానన్నారు రోహిత్ శర్మ.
మరి రోహిత్ మునుపటిలా భీకరమైన ఫామ్ లో లేడని తెలిసిందే. మరి వరల్డ్ కప్ సమయానికి టీం ఇండియా బాగా తేరుకుని మళ్ళీ వరల్డ్ కప్ టైటిల్ ను గెలుస్తారా చూడాలి.