కేజీఎఫ్ చిత్ర బృందానికి బాలీవుడ్ స్టార్ హీరో క్షమాపణలు చెప్పినట్టు పేర్కొన్నారు. అమీర్ ఖాన్ లాల్ సింగ్ చద్దా సినిమాలో నటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమా ఎప్రిల్ 14న విడుదల కానుంది. అయితే అదే రోజున కేజీఎఫ్ 2 సినిమా కూడా విడుదల కానుంది. ఒకే రోజు రెండు సినిమాలు విడుదలకు ఉండటంతో ఓ మీడియా సిబ్బంధి కేజీఎఫ్ 2 కు పోటీగా విడుదల చేస్తున్నారా..? అంటూ అమీర్ ఖాన్ ను ప్రశ్నించారు.
దానికి అమీర్ ఖాన్ సమాధానమిస్తూ…లాల్ సింగ్ చద్దా బైసఖి రోజున రావడం సరైన నిర్ణయమేనని అన్నారు. కేజీఎఫ్ 2 కు పోటీగా విడుదల చేయాలని ఆ రోజును ఎంచుకోలేదని చెప్పారు. సినిమా నేపథ్యం దృశ్యా ఆరోజు విడుదల చేయాలని భావించామని తెలిపారు. అంతే కాకుండా సినిమా విడుదలకు ముందే తాను క్షమాపణలు కోరుతూ హీరో యశ్ మరియు దర్శకుడికి లేఖ రాశానని అమీర్ ఖాన్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా అమీర్ ఖాన్ నటించిన లాల్ సింగ్ చద్ధా సినిమాలో మన తెలుగు హీరో అమీర్ ఖాన్ కూడా నటించిన సంగతి తెలిసిందే.