RadheShyam :”రాధేశ్యామ్” లవ్ ఆంథెమ్ కు ముహూర్తం ఫిక్స్.. ప్రభాస్ ఫాన్స్ కు ఇక పండగే

-

రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటిస్తున్న తాజా చిత్రం రాధేశ్యాం. పాన్ ఇండియా మూవీ సినిమా కు… టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ డైరెక్టర్ రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమా యూవీ క్రియేషన్స్ సమర్పణలో తెరకెక్కుతోంది. 1960 నాటి వింటేజ్‌ ప్రేమకథ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం లో ప్రభాస్‌ టాలీవుడ్ బుట్ట‌బొమ్మ పూజాహెగ్డే జంటగా న‌టిస్తుంది.

భారీ బడ్జెట్‏ మూవీగా యూవీ క్రియేషన్స్, టీసిరీస్ బ్యానర్లపై భూషణ్ కుమార్, వంశీ, ప్రమోద్, ప్రసీద సంయుక్తంగా నిర్మిస్తున్నారు. అయితే.. తాజాగా ఈ సినిమా ను ఓ బిగ్‌ అప్డేట్‌ వచ్చేసింది.

తాజాగా ఈ సినిమా నుంచి మరో అప్డేట్ వచ్చింది. ఈ సినిమా నుంచి లవ్ ఆంథెమ్ ను రేపు విడుదల చేస్తున్నట్లు అఫీషియల్ గా చిత్రబృందం ప్రకటించింది. ఈ మేరకు పోస్టర్ కూడా విడుదల చేసింది చిత్రబృందం. ఇక ఇందులో ప్రభాస్ అలాగే పూజా హెగ్డే రొమాంటిక్ యాంగిల్ లో మనకు కనిపించారు. ఈ సాంగ్ టీజర్ ను రేపు సాయంత్రం 7 గంటల సమయంలో విడుదల చేయనున్నట్లు ప్రకటించింది చిత్రబృందం. అలాగే హిందీ టీజర్ ను 1:00 గంటలకు చేస్తామని ప్రకటించింది.

Read more RELATED
Recommended to you

Latest news