భారత ప్రభుత్వం తాజాగా మరో 118 చైనీస్ యాప్స్ ను నిషేధించిన సంగతి తెలిసిందే. వాటిలో పబ్‌జి మొబైల్ గేమ్ యాప్ కూడా ఒకటి. కాగా భారత్ తీసుకున్న ఈ నిర్ణయాన్ని అమెరికా సమర్థించింది. ఇండియా ఆ యాప్స్‌ను బ్యాచ్ చేసి సరైన నిర్ణయమే తీసుకుందని యూఎస్ అండర్ సెక్రెటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఎకనామిక్ గ్రోత్ కెయిత్ క్రాక్ అన్నారు.
ఇండియా ఇప్పటికే 100కు పైగా చైనా యాప్స్ ను బ్యాన్ చేసిందని, ఇతర దేశాల యాప్స్ నుంచి స్వాతంత్య్రం కోరుకునే దేశాలన్నీ ముందుకు రావాలని, కలసి కట్టుగా పనిచేసి క్లీన్ నెట్‌వర్క్‌ను సృష్టించాలని అన్నారు. కాగా అమెరికా ప్రభుత్వం ఈ ఏడాది ఆరంభంలోనే క్లీన్ నెట్‌వర్క్ ప్రోగ్రామ్‌ను ఆవిష్కరించింది.
క్లీన్ నెట్‌వర్క్ ప్రోగ్రామ్ అంటే.. చైనా దేశం అమెరికా పౌరుల డేటాను చోరీ చేయకుండా వారికి రక్షణ కల్పించడం, అలాగే వారి ప్రైవసీని కాపాడడం అన్నమాట. క్లీన్ నెట్ వర్క్ వల్ల ఇతర దేశాల నుంచి మన పౌరుల డేటా, ప్రైవసీ, సెక్యూరిటీ, హ్యూమన్ రైట్స్‌కు భంగం కలగకుండా ఉంటుంది. తాజాగా భారత్ ఆయా యాప్స్ ను బ్యాన్ చేయడంతో అమెరికా భారత్ నిర్ణయాన్ని సమర్థిస్తూ పై విధంగా స్పందించింది.