అగ్రరాజ్యంలో 150 మిలియన్ల ర్యాపిడ్‌ టెస్ట్‌ కిట్ల పంపిణీ…?

-

అమెరికాలో కరోనా కేసులు పెరుగుతుండడంతో భారీ ప్రణాళిక రూపొందించింది అక్కడి ప్రభుత్వం. కరోనా సోకిన వారిని గుర్తించి, వైరస్ ను కట్టడి చేసేందుకు అమెరికా సర్కార్ ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. ఏకంగా 15 కోట్ల ర్యాపిడ్ టెస్ట్ కిట్లను పంపిణీ చేసేందుకు నిర్ణయించినట్టు తెలిపారు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్. 15 నిమిషాల్లో కరోనాను నిర్ధారించే అబోట్ ర్యాపిడ్ పాయింట్ ఆఫ్ కేర్ కిట్లను పంపిణీ చేయనున్నట్టు తెలిపారు.

అమెరికాలో ఆర్థిక వ్యవస్థల పునరుద్దరణతో పాటుగా విద్యాసంస్థలను తిరిగి ప్రారంభించేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు తెలిపారు ట్రంప్. ఇందులో భాగంగానే..కరోనా సోకిన వారిని గుర్తించేందుకు పెద్దసంఖ్యలో ర్యాపిడ్ కిట్లను పంపిణీ చేస్తున్నట్టు చెప్పారు. వీటిలో 5 కోట్ల కిట్లను వైరస్ ముప్పు ఎక్కువగా ఉన్న వైద్య సిబ్బంది, ఇతరులకు ఇస్తామన్నారు ట్రంప్. స్కూళ్లు, వ్యాపార, వాణిజ్య సంస్థలు, కంపెనీల్లో మిగితా కిట్లను వాడనున్నట్టు తెలిపారు. ఇప్పటికే అమెరికా వ్యాప్తంగా 10 కోట్ల మందికి వైరస్ నిర్థారణ పరీక్షలు చేశామన్నారు ట్రంప్. ఎక్కకువ పరీక్షలు చేసిన దేశాల జాబితాలో అమెరికా తర్వాత భారత్‌ ఉందని చెప్పారు.

Read more RELATED
Recommended to you

Latest news