చంద్రబాబు ఒకరిని ప్రేమించారంటే… సారి సారీ… చేరదీశారంటే, పక్కన కూర్చోబెట్టుకున్నారంటే కచ్చితంగా అందులో అంతర్లీనంతా మరో బలమైన ప్రయోజనం ఉండి ఉంటుందనేది బాబుతో బాగా చనువున్నవారు.. బాబు గురించి బాగా తెలిసినవారు చెప్పే మాట! ప్రస్తుతం ఈ మాటలు అశోక్ గజపతి రాజు విషయంలో అప్లై చేసి చూస్తున్నారు ఆయన అభిమానులు!
విజయనగర రాజులకు సంబంధించిన మాన్సాస్ ట్రస్టును బాబు & కో అద్భుతంగా వాడుకున్నారనేది స్థానికంగా ఒక అనఫిషియల్ టాక్! “బ్లాక్ అండ్ వైట్” కోసం ఇది వారికి బాగా ఉపయోగపడిందని కూడా చాలా మంది ఆఫ్ ద రికార్డ్ చెబుతుంటారు! అయితే ప్రస్తుతం ఆ ట్రస్టు చంద్రబాబు సన్నిహితుడని చెప్పే అశోక్ గజపతిరాజు చేయిదాటిపోయిన సంగతి తెలిసిందే! ఈ క్రమంలో ఇంక అశోక్ అవసరం తనకేముంది అనేది బాబు సెల్ఫ్ క్వశ్చన్!!
అవును… అశోక్ గజపతిరాజు, ఆయన కుమార్తె అతిధి గజపతిరాజు 2019 ఎన్నికల్లో ఓడిపోయినప్పటికీ, జగన్ ప్రభంజనంలో కొట్టుకుపోయినప్పటికీ… పార్టీ కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటున్నారు! ఓటమికీ గెలుపుకీ పెద్ద తేడా లేదులే అన్నట్లుగా సాగిపోతున్నారు! ఈ క్రమంలో… అశోక్ కూతురు అతిధి ని పార్లమెంట్ నియోజకవర్గానికి ఇన్ చార్జ్ చేస్తారని వారి అభిమానులతో పాటు జిల్లా జనాలు కూడా భావించారు!
కార్యకర్తలు, అభిమానులు ఒకటి తలస్తే.. బాబు మరొకటి తలచారు! మాన్సాస్ లేనందువల్ల అశోక్ పై మనసులేదో, రాలేదో తెలియదు కానీ… కళా వెంకటరావు తమ్ముడు కొడుక్కి ఆ పదవి అప్పగించారు! దీంతో… అశోక్ కూడా బలేనా అని ఆయన అభిమానులు కామెంట్లు చేస్తున్నారు!
కాగా… పలుమార్లు రాష్త్ర మంత్రిగా, ఒకసారి కేంద్ర మంత్రిగా పనిచేసిన అశోక్ గజపతిరాజు టీడీపీ వ్యవస్థాపక సభ్యుడు! అంటే… చంద్రబాబు కంటే కూడా పార్టీలో చాలా సీనియర్!!
-CH Raja