అమెరికా: ప్రపంచవ్యాప్తంగా కరోనా రక్కసి విలయతాండవం సృష్టిస్తున్న విషయం తెలిసిందే. ఎన్ని కఠిన నిబంధనలు పాటిస్తున్నా వైరస్ వ్యాప్తిని నిరోధించడం కత్తిమీద సాము అయింది. ఈ మహమ్మారి కట్టడికి వ్యాక్సినే తప్పనిసరి అని నిపుణులు అంటున్నారు. దీంతో చాలా దేశాలు టీకాల తయారీపై దృష్టి పెట్టాయి. అయితే కొన్ని దేశాల్లో అసలు వ్యాక్సిన్లు అందుకోలేని పరిస్థితిలో నెలకొంది. దీంతో ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) శుభవార్త తెలిపింది. ‘కొవ్యాక్స్’ కార్యక్రమం ద్వారా టీకాలు అందించాలని నిర్ణయించింది. అయితే ఇంకా కొన్ని దేశాల్లో వ్యాక్సిన్ల కొరత ఏర్పడింది.
ఈ మేరకు టీకాల కొరతపై అమెరికా కీలక నిర్ణయం తీసుకుంది. కోవిడ్ వ్యాక్సిన్ల పేటెంట్స్ రద్దు చేయాలని జో బైడెన్ సర్కార్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. . టీకాల మేధో సంపత్తి(ఐపీ) హక్కులను తొలగించేందుకు సిద్ధమైంది. ఇదే జరిగితే ఒక దేశం టీకాల ఫార్ములాను ఇతర దేశాలకు ఇచ్చే అవకాశం ఏర్పడుతుంది. దాంతో ప్రపంచదేశాలు అన్ని రకాల టీకాలను తయారు చేయొచ్చు. వ్యాక్సిన్ల ఉత్పత్తి సామర్థ్యం పెంపుతో కొరత తీర్చుకోవచ్చు.. మహమ్మారితో పోరులో భాగంగా అగ్రరాజ్యం ఈ కీలక నిర్ణయాన్ని తీసుకుంటున్నట్లు ఆ దేశ వైద్య నిపుణులు తెలిపాయి. ఇప్పటికే ఈ విషయంపై భారత్, దక్షిణాఫ్రికా తమ అభిప్రాయాన్ని అమెరికాకు తెలిపాయి.
భారత్, దక్షిణాఫ్రికా అభ్యర్థనను స్వీకరించిన అమెరికా మేథో సంపత్తి హక్కుల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు అమెరికా వ్యాపార ప్రతినిధి కేథరిన్ టాయ్ తెలిపారు. కొవిడ్ అంతం చేసేందుకు వ్యాక్సిన్ల మేధో సంపత్తి(ఐపీ) హక్కులను రద్దుకు అమెరికా సంఘీభావం తెలిపిందని ఆయన చెప్పారు. అయితే ఈ అంశంలో ప్రపంచవాణిజ్య సంస్థ సూత్రాలకు అనుగుణంగా పని చేస్తామని పేర్కొన్నారు. అంతర్జాతీయ ఒప్పందాలకు సమయం పట్టే అవకాశం ఉందని కేథరిన్ టాయ్ స్పష్టం చేశారు. వ్యాక్సినేషన్‌ను వేగవంతం చేసేందుకు, టీకాల ఉత్పతిని పెంచేందుకు తాము ప్రపంచ వాణిజ్య సంస్థ(డబ్ల్యూటీఓ), ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ)తో కలిసి పని చేయడానికి రెడీగా ఉన్నట్లు కేథరిన్ టాయ్ తెలిపారు. అయితే నైతిక, ఆర్థిక సమస్య ఏర్పడే అవకాశం ఉందని డబ్ల్యూటీఓ న్గోజీ ఒకోంజో ఇవేలా స్పష్టం చేశారు.