అమెరికా నుంచి ఎవరైనా వస్తున్నారు అనగానే ఉండే ఆసక్తి అంతా ఇంతా కాదు. వాళ్ళ చెప్పుల నుంచి జడ రబ్బర్ వరకు ప్రతీ ఒక్కటి ఆసక్తికరంగానే ఉంటుంది. వాళ్ళు ఎం చేసినా సరే ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రస్తుతం అమెరికా పర్యటనలో ఉన్న ట్రంప్ దంపతుల గురించి ప్రతీ ఒక్కటి ఆసక్తికరంగానే ఉంది. అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ భార్య… మెలానియా ట్రంప్ దుస్తుల గురించి ఇప్పుడు పెద్ద చర్చలు జరుగుతున్నాయి.
ఆమె వేసుకునే దుస్తుల గురించి ఎక్కువగా మాట్లాడుకుంటున్నారు. భారత పర్యటన కోసం ఆమె ప్రత్యేకంగా దుస్తులను సిద్ద౦ చేయించుకున్నారు. అయితే ఆమె దుస్తులపై కమలం గుర్తు ఉంది. మన జాతీయ పుష్పం కమలం కాగా బిజెపి గుర్తు కూడా కమలమే. దీనితో ఆమె బిజెపి ని బుట్టలో వేసుకోవడానికి ఆ దుస్తులు వేసుకున్నారని అంటున్నారు. ప్రస్తుత౦ సోషల్ మీడియాలో ఈ దుస్తులు ఎక్కువగా వైరల్ గా మారాయి.
భారత జాతీయ చిహ్నానికి గౌరవ సూచకంగా ఆ డ్రెస్ ధరించిందని అంటున్నారు. మెలానియా ట్రంప్ కమలం పూల డ్రెస్ ధరెంతో తెలుసా..? దాదాపు 1.15లక్షల రూపాయలు. ఇలా ఆమె దుస్తులపై చర్చ జరుగుతుంది. కాగా ట్రంప్ దంపతులు ప్రస్తుతం రాష్ట్రపతి భవన్ లో విందుకి హాజరయ్యారు. అక్కడి నుంచి రాత్రి 10 గంటలకు తిరిగి అమెరికా వెళ్తారు. కాగా హైదరాబాద్ హౌస్ లో మోడితో ట్రంప్ భేటి అయ్యారు.