దివంగత వైయస్ వివేకానంద రెడ్డి కూతురు వైఎస్ సునీత తన తండ్రి హత్య కేసు లో జరుగుతున్న విచారణ విషయంలో చాలా అసంతృప్తిగా ఉన్నారు. వివేక హత్య కేసు విషయంలో గతంలో జగన్ ప్రతిపక్షంలో ఉన్న సమయంలో సిబిఐకి ఇవ్వాలి అంటూ హైకోర్టును ఆశ్రయించడం జరిగింది.
ఆ తర్వాత ముఖ్యమంత్రి అయ్యాక ఉన్నట్టుండి హైకోర్టులో వేసిన పిటిషన్ ను వెనక్కి తీసుకుంటూ దానికి కారణాలు చెబుతూ మెమో దాఖలు చేశారు. ఈ నేపథ్యంలో తాజాగా ఈ మెమోని వెనక్కి తీసుకోవడం పట్ల వైఎస్ వివేకా కూతురు తరపు న్యాయవాది తీవ్ర అభ్యంతరం చెప్పారు. ఇదే సమయంలో జగన్ మోహన్ రెడ్డి తరపు న్యాయవాది ఎందుకు వెనక్కి తీసుకున్నాము దాని గురించి ఇటీవల హైకోర్టు కి వివరణ ఇవ్వడం జరిగింది.
అయితే ఇరు పక్షాల వాదనలు విన్న, హైకోర్ట్, తీర్పుని రిజర్వ్ లో పెట్టింది. దీని పై త్వరలోనే తీర్పు రానుంది. అయితే ఈ పిటీషన్ పై గత నెల రోజులగా ట్విస్ట్ లు మీద ట్విస్ట్ లు నడిచాయి. వివేక కూతురు వేసిన పిటీషన్ లో, వైసీపీ ఎంపీల పేర్లు, వైఎస్ ఫ్యామిలీలో వాళ్ళ పేర్లు ఉండటంతో, ఒక్కసారి సంచలనంగా మారింది. ఈ నేపథ్యంలో త్వరలో వైఎస్ జగన్ తో ఈ కేసు గురించి వైయస్ సునీత చర్చించ బోతున్నట్లు వార్తలు వినబడుతున్నాయి.