మరోసారి అమెరికా బుద్ధి బయటపడింది…

-

ఒకపక్క అమెరికా కరోనా వైరస్ దెబ్బకు బాగా ఇబ్బంది పడుతుంది. వేల మరణాలు, లక్షల కేసులతో అగ్ర రాజ్యం అమెరికా చుక్కలు చూస్తుంది. కరోనా వైరస్ ని కట్టడి చేయడం ఎలాగూ ప్రపంచ దేశాలను కట్టడి చేసిన అమెరికాకు మాత్రం ఇప్పుడు అర్ధం కావడం లేదు. ఇక ఇదిలా ఉంటే అమెరికా బుద్ధి మాత్రం మారడం లేదు. ఆఫ్ఘన్ లోని కొన్ని ప్రావిన్సుల్లో అమెరికా బలగాలు భారీ దాడులు చేసాయి.

ఆల్ఖైదా ఉగ్రవాదులను, ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని, సిరియా, ఇరాక్ లో అమెరికా దాడులు చేసినట్టు సమాచారం. ఇక ఈ దాడుల్లో ఎంత మంది మరణించారు అనేది ఎవరికి స్పష్టత లేదు. ఇక ఇరాన్ లక్ష్యంగా కూడా అమెరికా గురి పెడుతుంది అంటున్నారు. అమెరికా బలగాలను గత కొన్ని రోజులుగా ఇరాన్ టార్గెట్ చేస్తూ వస్తుంది. ఈ క్రమంలోనే దాడులకు టార్గెట్ చేసినట్టు సమాచారం.

ఇక ట్రంప్ కూడా ఇరాన్ విషయంలో కొన్ని సంచలన వ్యాఖ్యలు చేస్తున్నారు. కరోనా తర్వాత ఇరాన్ వైఖరి మారింది అంటూ ఆయన సమయం సందర్భం లేకుండా వ్యాఖ్యలు చేసారు. దీనిపై ఇప్పుడు తీవ్ర విమర్శలు వస్తున్నాయి. ఇంకా ఎప్పుడు ట్రంప్ వైఖరి మారుతుంది అంటూ ప్రపంచ దేశాలు ఆశగా ఎదురు చూస్తున్నాయి. మరి ఆయన ఎప్పుడు మారతారో చూడాలి.

Read more RELATED
Recommended to you

Latest news