ప్రముఖ షార్ట్ వీడియో మెసేజింగ్ యాప్ టిక్‌టాక్‌కు అమెరికాలోనూ గట్టి ఎదురు దెబ్బ తగిలింది. టిక్‌టాక్ యాప్‌ను నిషేధిస్తున్నట్లు ఆ దేశ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ప్రకటించారు. ఈ మేరకు ఆయన ఓ ఎగ్జిక్యూటివ్ ఆర్డర్‌పై సంతకం చేశారు. అది మరో 45 రోజుల్లోగా అమల్లోకి వస్తుంది. అప్పటి వరకు టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ కొనుగోలు చేస్తే సరి. లేదంటే ఇక యాప్ శాశ్వతంగా అమెరికాలో బ్యాన్ అవుతుంది.
చైనాకు చెందిన టిక్‌టాక్ యాప్ అమెరికా పౌరుల డేటాను తస్కరిస్తున్నదని, ఆ యాప్ దేశ భద్రతకు, ఆర్థిక వ్యవస్థకు పెను ముప్పుగా మారిందని ట్రంప్ అన్నారు. అయితే టిక్‌టాక్ ఆ వాదనలను కొట్టి పారేసింది. తమ యాప్‌లోని యూజర్ల డేటా భద్రంగా ఉందని, దాన్ని చైనాకు చేరవేయలేదని స్పష్టం చేసింది. కాగా టిక్‌టాక్‌కు అమెరికాలో 80 మిలియన్ల మంత్లీ యాక్టివ్ యూజర్లు ఉన్నారు. ఈ క్రమంలో టిక్‌టాక్ బ్యాన్ అయితే దాని మాతృసంస్థ బైట్ డ్యాన్స్‌కు తీవ్రమైన నష్టం వాటిల్లనుంది.
కాగా ఇప్పటికే మైక్రోసాఫ్ట్ సంస్థ టిక్‌టాక్‌ను కొనుగోలు చేసే యత్నాలు ప్రారంభించింది. ఈ విషయమై టిక్‌టాక్‌తో చర్చలు నిర్వహిస్తున్నట్లు ధ్రువీకరించింది. ఇక ట్రంప్ కూడా అందుకు గడువు ఇచ్చారు. 45 రోజుల్లోగా కొనుగోలు ప్రక్రియ పూర్తి కాకపోతే ఆ తరువాత యాప్ బ్యాన్ అవుతుంది.