పూలమ్మినచోటే కట్టేలు… బాబు ఆటలు సాగనివ్వని టీడీపీ నేతలు!

-

గత మూడు రోజుల క్రితం ఆయాసంతో కూడిన బాబు ఆవేశం గమనించినవారంతా… కచ్చితంగా అద్భుతం ఆశించారు! 48 గంటల తర్వాత ఇక తగ్గేది లేదు… సమయం లేదు తమ్ముళ్లు రాజినామాలకు సిద్ధంకండి అని అంటారని అంతా భావించారు! కానీ… అది జరగకపోయేసరికి అంతా బాబుదే నేరం అన్నట్లుగా విమర్శలు గుప్పిస్తున్నారు కానీ… (పూర్తి) నేరం బాబుది కాదంట… టీడీపీ నేతలదంట! అదికూడా బాబుకంటే బలంగా వారు ఆలోచించడమే!

అవును… చంద్రబాబు తన 23మంది ఎమ్మెల్యేలతో రాజినామాలు చేయిస్తారని అంతా ఊహించిన సంగతి తెలిసిందే. కానీ మాటలకూ చేతలకూ చాలా తేడాఉందని… తననుంచి రెండోది ఎక్కువగా ఆశించొద్దని బాబు మరోసారి నిరూపించారు! అయితే… ఇక్కడ బాబు ఒక స్కెచ్ వేశారని అంటున్నారు. కానీ ఆ ఆటలు టీడీపీ నేతలే సాగనివ్వలేదని రాజకీయవర్గాల్లో చర్చ నడుస్తోంది!

ముందుగా 23మంది ఎమ్మెల్యేలూ రాజినామాలు చేసి, అనంతరం ఎంపీలు, తర్వాత ఎమ్మెల్సీలు కూడా రాజినామాలు చేయిద్దామని బాబుకు సూచనలు అందాయంట! ఈ ఆలోచనకు బాలయ్యతో కలిపి మిగిలిన ఎమ్మెల్యేలు ఎవరూ ఒప్పుకోలేదని అంటున్నారు! అయితే… తాను సేవ్ అయ్యే క్రమంలో రాష్ట్రం అంతా వద్దు… కేవలం అమరావతి ప్రాంతలోని నేతలతోనే రాజినామాలు చేయించాలని స్కెచ్ వేశారంట. అలా అయితే… బాబు & చినబాబు కూడా వారి కుర్చీలను కాపాడుకున్నవారవుతారు కాబట్టి!

ఇందులో భాగంగా సీఆర్డీఏ పరిధిలోని మద్దాలగిరి, వల్లభనేని వంశీ లాంటి ఎమ్మెల్యేలు ఇప్పటికే ఫ్యాన్ కింద సేదతీరుతున్న సమయంలో… ఇద్దరు ఎంపీలపై బాబు దృష్టిసారించారని అంటున్నారు. వారిలో ఒకరు కేశినేని నానీ కాగా.. మరొకరు గల్లా జయదేవ్! వీరిలో ఒకరు కాస్త హార్ష్ గా స్పందించి “నో” అంటే… మరొకరు కాస్త సాఫ్ట్ గా స్పందించి “నో” అన్నారంట. ఇక మిగిలిన ఆంధ్రా ప్రాంతంలోని నేతలు కూడా… అమరావతి కోసం అని ఆలోచిస్తే… నియోజకవర్గంలో ప్రజలు బయట తిరగనివ్వరి భయపడుతున్నారంట.

ఇక సీమ విషయానికొస్తే అక్కడ గెలిచింది చంద్రబాబు – బాలకృష్ణ మాత్రమే. ఇక ఉత్తరాంధ్ర విషయాకొస్తే… విశాఖకు వస్తోన్న రాజధానిని ఆపాలని అనడమే తాము చేసే అతిపెద్ద నేరం. ఇక ఏకంగా విశాఖకు రాజధాని హోదా వద్దని రాజినామాలు కూడా చేస్తే… భవిష్యత్తు ప్రశ్నార్ధకం అయిపోతుందని సెలవిచ్చారంట. దీంతో… ఒకప్పుడు కింగ్ గా ఉంటూ పార్టీ నేతలను శాసించిన బాబు పరిస్థితి… పూలమ్మిన చోటే కట్టెలమ్మేలా తయారయ్యిందనే కామెంట్లు వినిపిస్తున్నాయి!

Read more RELATED
Recommended to you

Latest news