అమెరికా విదేశాంగ కార్యదర్శి మైక్ పాంపియో… మంగళవారం టోక్యోలో విదేశాంగ మంత్రి ఎస్ జైశంకర్ ను కలిశారు. ఈ సందర్భంగా ఇండో-పసిఫిక్ మరియు ప్రపంచ వ్యాప్తంగా అభివృద్ధి, శాంతి, శ్రేయస్సు మరియు భద్రత కోసం కలిసి పనిచేయవలసిన అవసరాన్ని ఆయన స్పష్టం చేసారు. ఇక ఈ సందర్భంగా కీలక వ్యాఖ్యలు చేసారు. వాస్తవ నియంత్రణ రేఖ వెంట చైనా 60,000 మందికి పైగా సైనికులను మోహరించింది అని ఆయన పేర్కొన్నారు.
చైనీయులు ఇప్పుడు ఉత్తరాన భారతదేశానికి వ్యతిరేకంగా భారీ సైన్యాన్ని మోహరిస్తున్నారు అని ఆయన పేర్కొన్నారు. ఇండో-పసిఫిక్, దక్షిణ చైనా సముద్రంలో మరియు తూర్పు లడఖ్‌లోని వాస్తవ నియంత్రణ రేఖ (ఎల్‌ఐసి) వెంట చైనా దూకుడుపై భారత్, అమెరికా మధ్య చర్చ జరిగింది. ఆస్ట్రేలియా, జపాన్ సహా పలు దేశాల విదేశాంగ శాఖా మంత్రులతో సమావేశం అయ్యారు.