హమ్మయ్య; ఇరాన్ అమెరికా వార్ లేదు…!

-

మధ్యప్రాచార్యంలో అమెరికా తీసుకునే నిర్ణయాలు వివాదాస్పదంగా మారిన సంగతి తెలిసిందే. ఇరాన్ టాప్ కమాండర్ జనరల్ ఖాసీం సులైమానీని అమెరికా హత్య చేసిన తర్వాత ఇరాన్ అమెరికాను లక్ష్యంగా చేసుకుని ఇరాక్ లో దాడులు చేస్తున్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ వ్యవహారశైలి ఈ విషయంలో వివాదాస్పదంగా మారింది. దీనితో ఇరాన్ ప్రతీకార దాడులకు దిగుతుంది.

ఈ తరుణంలో ట్రంప్‌కు అక్కడి పార్లమెంట్ ఊహించని షాక్ ఇచ్చింది. ఇరాన్‌పై యుద్ధం ప్రకటించడానికి అవసరమైన అధికారాలను అమెరికా అధ్యక్షుడికి తగ్గించాలని హౌస్ ఆఫ్ రిప్రజంటేటివ్స్‌లో తీర్మానం ప్రవేశ పెట్టగా ఈ తీర్మానానికి 224 మంది ఆమోదం తెలపగా, 194 మంది వ్యతిరేకించారు. దీనితో ఆయన అధికారాలకు కత్తెర పడింది. ఇక ఇరాన్ పై ఆయన ఏ నిర్ణయ౦ సొంతగా తీసుకోలేరు.

ఈ తీర్మానానికి డెమోక్రాట్లతో పాటు పలువురు రిపబ్లికన్లు కూడా మద్దతివ్వడం ట్రంప్ కి షాక్ ఇచ్చిన పరిణామ౦. ముఖ్యంగా సులైమాని హత్యకు ఆయన ఆదేశాలు ఇవ్వడం తోనే అమెరికా పార్లమెంట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ఆ నిర్ణయంతోనే ఇప్పుడు మధ్యప్రాచ్యంలో అమెరికాకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తాయి. అక్కడి నుంచి అమెరికా ఖాళీ చేసి వెళ్లిపోవాలి అనే డిమాండ్ అన్ని దేశాల నుంచి బలంగా వినపడుతుంది. దీనితో ఇరాన్ అమెరికా యుద్ధం లేనట్టే.

Read more RELATED
Recommended to you

Latest news