కోర్ట్ కి హాజరైన జగన్

-

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అక్రమాస్తుల కేసులో శుక్రవారం నాంపల్లి సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. శుక్రవారం ఉదయం గన్నవరం నుంచి ప్రత్యేక విమానంలో బేగంపేట ఎయిర్‌పోర్టుకు చేరుకున్న జగన్ అక్కడి నుంచి నేరుగా నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టుకు వెళ్ళారు. ఈ కేసులో జగన్ తో పాటు వైసీపీ రాజ్యసభ ఎంపీ విజయసాయిరెడ్డి, ఎమ్మెల్యే ధర్మాన ప్రసాదరావు కూడా కోర్టుకు హాజరయ్యారు.

మధ్యాహ్నం 2 గంటల వరకు జగన్ కోర్ట్ లోనే ఉండనున్నారు. అక్కడి నుంచి నేరుగా ఆయన తిరిగి గన్నవరం వచ్చే అవకాశం ఉందని అంటున్నారు. ఇక ఇదిలా ఉంటే ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన ఇప్పటి వరకు కోర్ట్ కి హాజరు కాలేదు. ఈ నేపధ్యంలో జగన్ తీరుపై కోర్ట్ అసహనం వ్యక్తం చేసింది. ప్రతీసారి వ్యక్తిగత హాజరుకి మినహాయింపు ఇవ్వడం సాధ్యం కాదని కోర్ట్ కి రావాలని ఆదేశించింది.

ఈ విషయాన్ని జగన్ న్యాయవాదులకు కోర్ట్ స్పష్టంగా చెప్పింది. దీనితో జగన్ తొలిసారి కోర్ట్ కి ముఖ్యమంత్రి హోదాలో హాజరు అయ్యారు. జగన్ గత ఏడాది మార్చి 1 తర్వాత కోర్ట్ కి హాజరు కాలేదు. అక్రమాస్తుల కేసులో జగన్‌‌పై 11 చార్జిషీట్లను సీబీఐ అధికారులు కోర్టులో దాఖలు చేయగా ప్రతి చార్జ్‌‌షీట్ లో ఏ-1గా జగన్ ఉండగా, ఏ2 గా విజయసాయిరెడ్డి ఉన్నారు. ఆయన వ్యక్తిగత హాజరు మినహాయింపు పిటీషన్ కోర్ట్ కొట్టేసిన సంగతి తెలిసిందే.

Read more RELATED
Recommended to you

Latest news