అమెరికాలో జాత్యహంకార దాడులు మళ్ళీ మొదలయ్యాయి. గతంలో అంటే ట్రంప్ అధ్యక్షుడిగా ఎన్నికయిన కొన్ని నెలల తరువాత వరుసగా భారతీయులపై జాత్యహంకార దాడులు మొదలయ్యాయి. కొన్ని సందర్భాలలో భారతీయులు ఎంతో మంది చనిపోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఆ తరువాత ఈ దాడులపై భారతీయులు వరుస నిరసనలతో ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావడంతో కొంతకాలంగా ఈ రకమైన దాడులు ఆగిపోయాయి. అయితే
తాజాగా మళ్ళీ భారతీయులపై జాత్యహంకార దాడులు మొదలయ్యాయి. కొన్ని నెలల క్రితం ఇద్దరు విద్యార్ధులపై ఈ రకమైన దాడులు జరగగా తాజాగా ఓ భారతీయ సిక్కుపై జాత్యహంకార దాడి జరగడంతో మళ్ళీ అమెరికాలోని భారతీయుల్లో కలవరం మొదలయ్యింది. వివరాలలోకి వెళ్తే..ఉబెర్ కారు డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. గ్రెఫిన్ అనే అమెరికన్ షాపింగ్ కోసం ఉబెర్ కారు బుక్ చేసుకున్నాడు. ఆ కారు డ్రైవర్ గా సిక్కు వ్యక్తి వెళ్ళగా కారు ఎక్కింది మొదలు
సదరు భారతీయ సిక్కుపై జాతి విద్వేషకర వ్యాఖ్యలు చేయడం మొదలు పెట్టాడు. అక్కడితో ఆగకుండా అతడి గొంతు పిసికి, తీవ్రంగా గాయపరిచాడు. వెంటనే క్యాబ్ దిగి పారిపోయాడు. సిక్కు వ్యక్తి తేరుకున్న తరువాత 911 కి కాల్ చేసి పోలీసులకి ఫిర్యాదు చేయగా అతడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆ తరువాత అతడిని 9 లక్షల పూచి కత్తుతో విడుదల చేశారు.