బ్రేకింగ్: భారీగా ప‌త‌న‌మైన బంగారం ధ‌ర‌.. వెండి మాత్రం..

-

నిన్న స్థిరంగా ఉన్న బంగారం ధ‌ర‌లు ఈ రోజు భారీగా ప‌త‌న‌మ‌య్యాయి. బుధవారం హైదరాబాద్ మార్కెట్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 320 రూపాయలు తగ్గి 39,210 రూపాయల వద్దకు దిగి వచ్చింది. ఇక పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 180 రూపాయలు తగ్గి 35,940 రూపాయల వద్దకు చేరింది. అయితే, వెండి ధరలు ఈరోజు కేజీకి 90 రూపాయలు పెరిగాయి. దీంతో హైదరాబాద్ లో కేజీ వెండి ధర 47,490 వద్దకు చేరింది.

ఢిల్లీ మార్కెట్ లో కూడా బంగారం ధరలు పడిపోయాయి. ఇక్కడ పదిగ్రాముల 24 క్యారెట్ల బంగారం 200 రూపాయలు తగ్గి 37,900 రూపాయల వద్దకు చేరుకుంది. అదేవిధంగా పది గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర కూడా 200 రూపాయలు తగ్గి 36,700 రూపాయల వద్దఉంది. ఇక వెండి ధర ఇక్కడా కేజీకి 90 రూపాయల పెరుగుదల నమోదు చేసింది. దీంతో వెండి కేజీకి 47,490 రూపాయల వద్దకు చేరింది.

Read more RELATED
Recommended to you

Latest news