నిన్న అమెరికాలో జరిగిన వెటరన్స్ డే సందర్భంగా ట్రంప్ ఆయన సతీమణి కలిసి ఆర్లింగ్టన్ జాతీయ స్మశానవాటికను సందర్శించారు. అధ్యక్ష ఎన్నికల ఫలితాల తర్వాత ఒక్కసారి కూడా అధికారిక కార్యక్రమాలకు హాజరులేదు. కాని నిన్నే మొదటిసారు ట్రంప్ దంపతులు బయటికి వచ్చారు. మీడియా మొత్తం ట్రంప్ పై దృష్టి పెడితే.. ట్రంప్ భార్య చేసిన ఒక పనితో అందరి దృష్టని తన వైపు తిప్పుకున్నారు. నిన్న కార్యక్రమంలో పాల్గొన్న అమెరికన్ ఫస్ట్ లేడి మెలానియా ప్రవర్తించిన తీరు ఆశ్చర్యం కలిగించింది. మాస్క్ ధరించకూండా కోవిడ్ నిబంధనలు పాటించకూండా నిర్లక్ష్య దోరణి ప్రదర్శించారు. అంతేకాకుండా భర్త ట్రంప్ కు దూరంగా నిలబడి సైనికుడి చేయి పట్టుకుని నిలుచున్నారు. మెలానియా రూల్స్ పాటించకుండా వింతగా ప్రవర్తించారు.
ఇదీలా ఉందగా ట్రంప్‌కు మెలానియా త్వరలోనే విడాకులు ఇవ్వబోతున్నారంటూ వార్తలు హల్‌చల్ చేస్తున్నాయ్. ఈ రూమర్లకు ట్రంప్ మాజీ రాజకీయ సహాయకురాలైన ఒమరోసా మానిగోల్ట్ న్యూమాన్ మొదట తెరలేపారు. జనవరిలో ట్రంప్ అధ్యక్ష పీఠం దిగగానే వీరి వివాహ బంధానికి శుభం కార్డు పడనుందని న్యూమాన్ అన్నారు. దీనికి తోడు ఇప్పటికే పలు కార్యక్రమాల్లో ట్రంప్ దంపతులు ఎడ మొహం పెడ మొహంగా ఉంటున్నారు. దీంతో ఆ రూమార్లకు మరింత బలం చేకూరింది. ఇక ఇదే అదనుగా ట్రంప్, మెలానియాల విడాకులపై ఇప్పటికే చాలా రూమర్లు పుట్టుకువస్తున్నాయి.
ఇదే కార్యక్రమానికి హాజరైన ఉపాధ్యక్షుడు మైక్ పెన్స్, ట్రంప్ కుమార్తె, ఇవాంక మరియు ఇతర నాయకులు సామాజిక దూరం పాటిస్తూ ఫేసు మాస్కులతో కనిపించారు. సైనికులకు దూరంగా నడిచారు. రూమర్లు త్వరలోనే నిజం కాబోతున్నాయని వారి ఫోటోలను చూసిన నెటిజన్ల్ కామెంట్లు పెడుతున్నారు. అసలు ఏది నిజమో తెలియాలంటే వేచి చూడాల్సిందే మరి.