నేడే వస్తున్న అమిత్ షా…? తెరాస మాజీ మంత్రికి కండువా

Join Our COmmunity

గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల నేపధ్యంలో ప్రచారం కోసం బిజెపి అగ్ర నేతలు హైదరాబాద్ వస్తున్నారు. బిజెపి కీలక నేత, కేంద్ర మంత్రి అమిత్ షా ఉదయం 10గంలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ ఎయిర్ పోర్ట్ కు వస్తున్నారు. ఎయిర్ పోర్ట్ వద్ద పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడే అవకాశం ఉంది. 10.45గంటలకు ఛార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు.

11.30గంలకు వారాసీగూడ చౌరస్తా నుంచి సీతాఫలమండి హనుమాన్ మందిర్ వరకు రోడ్ షో(1.3కిమీ) చేస్తారు. మధ్యాహ్నం 1.30గంటలకు నాంపల్లి పార్టీ కార్యాలయంలో ఆయన లంచ్ చేస్తారు అని పార్టీ వర్గాలు చెప్పాయి. అనంతరం పార్టీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహిస్తారు. పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడతారు. అమిత్ షా సమక్షంలో పలువురు ఇతర పార్టీల నాయకులు బీజేపీలో చేరే అవకాశం ఉందని, తెరాస మాజీ మంత్రి ఒకరు పార్టీ మారే అవకాశం ఉంది. సాయంత్రం 5.30గంటలకు ప్రత్యేక విమానంలో బేగంపేట్ నుంచి ఢిల్లీకి తిరుగు ప్రయాణం అవుతారు.

TOP STORIES

మీ జీవిత భాగస్వామిని ఎంచుకోవడంలో తడబడుతున్నారా? ఈ విషయాలు తెలుకోండి..

పెళ్ళి.. ఇద్దరి జీవితాలను ఒకటి చేసేది. ఇద్దరు వ్యక్తులను ఒకే దారిలో నడిపేది. మానవుడు అభివృద్ధి చెందుతున్న పరిణామ క్రమంలో పెళ్ళనేది అతడు సృష్టించుకున్న అత్యంత...