అమిత్‌ షాతో జూనియర్ ఎన్టీఆర్​ భేటీ

-

భాజపా అగ్రనేత అమిత్​ షా రాకతో రాష్ట్ర కమలదళంలో సరికొత్త ఉత్సాహం కనిపిస్తోంది. మునుగోడులో బహిరంగ సభ ముగిసిన అనంతరం అమిత్ షా.. సినీ నటుడు జూనియర్ ఎన్టీఆర్​ని కలవడం సర్వత్రా చర్చనీయాంశమైంది. సభ ముగిసిన అనంతరం హైదరాబాద్‌ విచ్చేసిన అమిత్‌షా శంషాబాద్‌ విమానాశ్రయంలోని నోవాటెల్‌కు రాత్రి 10.26కి చేరుకున్నారు. ఆ తర్వాత ఎన్టీఆర్‌ అక్కడికి వచ్చారు. కేంద్ర మంత్రి జి.కిషన్‌రెడ్డి ఎన్టీఆర్‌ను అమిత్‌షా వద్దకు తీసుకెళ్లారు. ఎన్టీఆర్‌ను అమిత్‌షా పుష్పగుచ్ఛంతో ఆహ్వానించగా.. అమిత్‌షాకు ఎన్టీఆర్‌ శాలువా కప్పి సత్కరించారు. మొత్తం 45 నిమిషాల సేపు సాగిన సమావేశంలో 20 నిమిషాలు ఇద్దరూ ఏకాంతంగా చర్చించుకున్నారు. అనంతరం వీరిద్దరితో పాటు పార్టీ నాయకులు కిషన్‌రెడ్డి, తరుణ్‌ఛుగ్‌, బండి సంజయ్‌లు కలిసి భోజనం చేశారు.

జూనియర్‌తో భేటీ సందర్భంగా అమిత్‌షా సీనియర్‌ ఎన్టీఆర్‌ గురించి ప్రస్తావించినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఎన్టీఆర్‌ నటించిన విశ్వామిత్ర, దానవీరశూర కర్ణ సినిమాలు తాను చూశానని తెలిపారు. ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అధికారులు బాగా పనిచేసేవారని ప్రశంసించారు.

జూనియర్‌ ఎన్టీఆర్‌తో సమావేశ విషయాన్ని అమిత్‌ షా ట్విటర్‌లో వెల్లడించారు. ‘అత్యంత ప్రతిభావంతుడైన నటుడు, తెలుగు సినిమా తారకరత్నం అయిన జూనియర్‌ ఎన్టీఆర్‌ను ఈ రోజు హైదరాబాద్‌లో కలిసి మాట్లాడడం చాలా ఆనందంగా అనిపించింది’ అని భాజపా అగ్రనేత పేర్కొన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news