‘విభజన కారణంగా దేశంలో కోట్లాదిమంది నిర్వాసితులుగా మారారు’

-

మత ప్రాతిపదికన దేశ విభజన చరిత్రలోనే చీకటి అధ్యాయమని కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా పేర్కొన్నారు. ఇందుకు దేశం ఎంతో మూల్యం చెల్లించాల్సి వచ్చిందన్న ఆయన.. 1947 నాటి భయానక అనుభవాలు ఎంతో మందిని ఇంకా వెంటాడుతూనే ఉన్నాయని చెప్పారు. దేశ విభజన సమయ ప్రాణాలు కోల్పోయిన వారికి నివాళులు అర్పించిన సందర్భంగా అమిత్ షా ఈ విధంగా మాట్లాడారు.

Amit Shah Inaugurates Projects Worth Rs 1052 Crore In Gujarat

ఈ సందర్భంగా మాట్లాడుతూ… మతప్రాతిపదికన దేశ విభజన సమయంలో లక్షలాదిమంది ప్రాణాలు కోల్పోయారని, కోట్లాదిమంది నిర్వాసితులుగా మారారన్నారు. విభజన కారణంగా ప్రాణాలు కోల్పోయిన వారికి అగస్ట్ 14న ‘విభజన గాయాల సంస్మరణ దినాన్ని’ పురస్కరించుకొని నివాళులర్పిస్తున్నట్లు అమిత్ షా పేర్కొన్నారు. ఇదిలా ఉండగా హర్ గర్ తిరంగా పేరుతో కార్యక్రమంలో భాగంగా అమిత్ షా తన ఇంటిపైన జాతీయ జెండాను ఎగురవేశారు.

 

 

Read more RELATED
Recommended to you

Latest news