సిట్టింగ్ ఎంపీకి ఎర్త్ పెడుతున్న బీజేపీ ఎమ్మెల్యేలు.. రసవత్తరంగా ఆదిలాబాద్ రాజకీయం

-

ఆదిలాబాద్ సిట్టింగ్ ఎంపీ సోయం బాపూరావుకు ఆ పార్టీ ఎమ్మెల్యేలే చెక్ పెడుతున్నారని ప్రచారం జరుగుతుంది.. అసెంబ్లీ ఎన్నికల్లో తమకు ఎలాంటి సహకారం అందించని సోయంని .. మార్చి.. ఆయన స్థానంలో కొత్తవారికి అవకాశం ఇవ్వాలంటూ బిజెపి అధినాయకత్వాన్ని ఎమ్మెల్యేలు కోరుతున్నారట.. ఈ క్రమంలోనే లోక్సభ పరిధిలో గెలిచిన బిజెపి ఎమ్మెల్యేలందరూ కొత్తవారిని ప్రోత్సహిస్తున్నారనే ప్రచారం పార్టీలో నడుస్తోంది. దీంతో కొద్దిరోజులుగా నియోజకవర్గంలో ఆశావాహులందరూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకొని మరి ట్రీస్ లో ఉన్నామనే సందేశాన్ని ఇస్తున్నారు..

mulugu leader resign to bjp party

ఆదిలాబాద్ లోక్సభ పరిధిలో ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. ఇక్కడ గెలిచిన బిజెపి ఎమ్మెల్యేలందరూ సిట్టింగ్ ఎంపి కి వ్యతిరేకంగా ఉన్నారట. దీంతో ఆయనకు వ్యతిరేకంగా ముక్కు ముఖం తెలియని నేతలందరినీ ఎమ్మెల్యేలు ప్రోత్సహిస్తున్నారట..
ఆదిలాబాద్ ఎస్టీ నియోజకవర్గ కావడంతో ఆదివాసి, లంబాడా తెగలకు చెందిన నేతలే రేసులో ఉన్నారు.
సిట్టింగ్ ఎంపీ బాపూరావు ఆదివాసీ తెగకు చెందిన వ్యక్తిగా ఉన్నారు.. అయితే లంబాడ సామాజిక వర్గానికి చెందిన నేతలు ఐదారు మంది పోటీలో ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది.పాలమూరుకు చెందిన నేతలు సైతం టికెట్ ఆశిస్తున్నారంట..

ఇటీవల జరిగిన ఓ సమావేశంలో ఎంపీ సోయం బాపూరావు చేసిన వ్యాఖ్యలు ప్రస్తుతం పార్టీలో ఆ టాపిక్ గా మారాయి.. ఫ్లెక్సీలు కడితే ఎంపీ అవ్వలేరని.. ఎంతమంది వ్యతిరేకించినా మరోసారి బరిలో ఉంటానని ఆయన స్పష్టం చేశారట.. మౌత్ పబ్లిసిటీ కోసం ఆశావాహులందరూ ఫ్లెక్సీల రాజకీయం చేస్తున్నారని అయన మండిపడుతున్నారట. నియోజకవర్గంలో ఎక్కడికెళ్లినా ఆశావాహులు భారీగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తూ ఉండటంతో..సిట్టింగ్ ఎంపీగా ఉన్న సోయం బాబురావుకి చిర్రెత్తుకుస్తోందని అయన అనుచరులు చెబుతున్నారు.. ఈ వ్యవహారం కాస్త బిజెపి అధినాయకత్వానికి తలనొప్పిగా మారిందని పార్టీ పార్టీ నేతలు చెప్తున్నారు.. దింతో బాబురావుకి అధిష్టానం మరో అవకాశం ఇస్తుందా లేక కొత్తవారికి అదృష్టం వరిస్తుందా అన్న టాక్ పార్లమెంట్ పరిధిలో నడుస్తోంది..

Read more RELATED
Recommended to you

Latest news