ఇండియాలో మళ్లీ కరోనా విలయ తాండవం చేస్తుంది. రోజురోజుకు కేసుల సంఖ్య పెరుగుతుండటంతో పాటు.. ప్రముఖులకు కూడా కొనసాగుతోంది. ఇప్పటికే సినీ ప్రముఖులు అలాగే రాజకీయ నాయకులు కరోనా బారిన పడ్డారు. అయితే తాజాగా అమితాబచ్చన్ ఇంట్లో కరోనా కలకలం రేపింది. ముంబైలోని అమితాబచ్చన్ నివాసం లో పనిచేస్తున్న ఓ ఉద్యోగి కరోనా పాజిటివ్ గా నిర్ధారణ అయింది.

జనవరి 2వ తేదీన ఈ ఫలితం రాగా… మిగతా సిబ్బందికి కూడా కరోనా పరీక్షలు చేయించారు. దీంతో ఆ సంఖ్య కాస్త 31కి చేరింది. దీంతో అమితాబచ్చన్ ఇంట్లో… కరోనా టెన్షన్ మొదలైంది. ఇక కరోనా సోకిన 31 మంది ని… హోం ఐసోలేషన్ లో ఉంచారు.
ప్రస్తుతం వారి ఆరోగ్యం కూడా నిలకడగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఇటు సిబ్బందికి కరోనా సోకడంతో అమితాబచ్చన్ ఇంట్లో ఉన్న వారు కూడా కరోనా పరీక్షలు చేయించుకుంటున్నారు. కాగా 2020 సంవత్సరం లో అమితాబ్ బచ్చన్ కు కరోనా సోకిన సంగతి తెలిసిందే. ఆ సమయంలో అమితాబచ్చన్ ముంబై నగరంలోని నానావతి ఆస్పత్రికి తరలించారు. ఆ తర్వాత ఆయన కలం నుంచి కోలుకున్నారు.