గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికలు మరింత హాట్ హాట్‌గా జరగనున్నాయి. బీజేపీ, టీఆర్‌ఎస్ పార్టీల మధ్య రాజకీయ వేడి పెరగనుంది..పోలింగ్ రోజు దగ్గర పడుతున్నాకొద్దీ గ్రేటర్‌లో రాజకీయ వాతావరణం వేడెక్కుతుంది. ఇప్పటికే రాజకీయ పార్టీల విమర్శలు ,ప్రతి విమర్శలతో హైదరాబాద్‌లో చలికాలంలో కూడా వేడి వాతావరణం కనిపిస్తుంది..టీఆర్‌ఎస్, ఎంఐఎం పోత్తులపై దూకుడుగా వ్యవహరిస్తున్న బీజేపీ తెలంగాణ నాయకత్వం..మరింత దూకుడు పెంచేందుకు జాతీయ నేతలను రంగంలోకి దింపుతోంది.
గ్రేటర్ ఎన్నికల ప్రచారంలో ఇప్పటికే బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా దిగగా రేపు కేంద్ర హోం మంత్రి అమిత్ షా, ఉత్తరప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆధిత్యనాథ్ ప్రచార బరిలోకి దిగనున్నట్లు సమాచారం.రేపు భాగ్యలక్ష్మి అమ్మవారిని దర్శించుకుని… సికింద్రాబాద్ పార్లమెంటు నియోజకవర్గంలో అమిత్ షా రోడ్ షో నిర్వహించనున్నారు. అమిత్ షా సమక్షంలో పార్టీలో విజయశాంతి లాంటి ప్రముఖ నేతలు చేరనున్నట్టు చెబుతున్నారు. రేపు ఉదయం 11 : 30 కి మొదలయ్యే ఆయన టూర్ రేపు సాయంత్రం ఏడున్నర దాకా సాగనుంది.