అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న ఫిక్స్..!

కేంద్ర హోంమంత్రి అమిత్ షా తెలంగాణ‌కు వ‌స్తున్నారంటూ గ‌త కొద్ది రోజులుగా వార్త‌లు వ‌స్తున్న సంగ‌తి తెలిసిందే. కాగా తాజాగా ఆయ‌న ప‌ర్య‌ట‌న పై క్లారిటీ వ‌చ్చేసింది. అమిత్ షా తెలంగాణ ప‌ర్య‌ట‌న ఫిక్స్ అయ్యింద‌ని ఎంపీ సోయం బాపూరావు స్ప‌ష్టం చేశారు. ఈ నెల 17న అమిత్ షా తెలంగాణ విమోచ‌న దినోత్స‌వం సంధ‌ర్భంగా నిర్మ‌ల్ జిల్లాలోని వెయ్యి ఊడ‌ల మ‌ర్రి వ‌ద్ద భారీ బహిరంగ స‌భ‌లో పాల్గొంటార‌ని స్ప‌ష్టం చేశారు.

అంతేకాకుండా అమిత్ షా నిర్మ‌ల్ స‌భకు హాజ‌ర‌య్యేనాటికి బండి సంజ‌య్ పాద‌యాత్ర కూడా నిర్మ‌ల్ కు చేర‌నుంది. దాంతో బండి సంజ‌య్ తో పాటు రాష్ట్రంలోని కీల‌క బీజేపీ నేత‌లంతా ఈ స‌మావేశంలో పాల్గొనే అవ‌కాశ‌ముంది. ఇక నిర్మ‌ల్ జిల్లా వెయ్యి ఊడ‌ల మ‌ర్రి వ‌ద్ద‌నే బీజేపీ బ‌హిరంగ స‌భ‌ను ఏర్పాటు చేయ‌డానికి కూడా ఓ కార‌ణ‌ముంది. వెయ్యి ఊడ‌ల మ‌ర్రివ‌ద్ద ర‌జాకార్లు వారికి వ్య‌తిరేకంగా కొట్టాడిన వెయ్యిమందిని చంపేశారు. ఈ నేప‌థ్యంలోనే ఆ ప్రాతంలో స‌భ‌ను ప్లాన్ చేశారు.