తెలంగాణలో మరో రెండు రోజులు భారీ వర్షాలు

-

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరో రెండు రోజుల పాటు వర్షాలు ఉన్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. నిన్నటి తీవ్ర అల్పపీడనం ఈ రోజు దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర దక్షిణ ఒడిస్సా ప్రాంతాలలో కేంద్రీకృతమైందని.. అల్పపీడనం కి అనుబంధంగా ఉన్న ఆవర్తనం సముద్ర మట్టం నుండి 7.6 కిమీ వరకు కేంద్రీకృతమై ఎత్తుకు వెళ్ళే కొలదీ నైరుతి దిశ వైపుకి వంపు తిరిగి స్థిరంగా కొనసాగుతూ ఉందని వెల్లడించింది. ‘

ఈ తీవ్ర అల్ప పీడనం రాగల 2 నుండి 3 రోజులలో పశ్చిమ & వాయువ్య దిశగా ప్రయాణించే అవకాశం ఉందని తెలిపింది. రుతుపవనాల ద్రోణి ఈ రోజు బికనుర్, భిల్వార్, ఇండోర్,భోపాల్,గొండియా, దక్షిణ ఛత్తీస్ ఘడ్ & పరిసర దక్షిణ ఒడిస్సా లోని అల్పపీడనం, గోపాల్ పూర్ మీదగా తూర్పు ఆగ్నేయ దిశగా తూర్పు మధ్య బంగాళా ఖాతం వరకు కొనసాగుతుందని వెల్లడించింది. ఈ నెల 11 వ తేదీన ఉత్తర మరియు పరిసర మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడే అవకాశాలు ఉన్నాయని తెలిపింది. దీని ప్రభావంగా ఈ రోజు మరియు రేపు భారీ నుండి అతి భారీ వర్షాలు ఉన్నట్లు తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news