ఎన్నికల సమయంలో ఆ నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న ముఖ్యమంత్రి జగన్ ఇచ్చిన హామీ, ప్రతీ ఒక్కరు బడికి వెళ్లి చదువుకునే విధంగా ప్రతీ ఏటా జనవరిలో తల్లి ఖాతాలోనే 15 వేలు రూపాయలు అమ్మ ఒడి పథకం ద్వారా అందిస్తామని. నవరత్నాలలో కీలక హామీగా అమ్మ ఒడి పథకం ఉంది. ఇప్పుడు ఇచ్చిన హామీ కోసం జగన్ తొలి ఏడాది నుంచే శ్రీకారం చుట్టారు. చెప్పాను కాబట్టి చెయ్యాలి అంటూ ఆర్ధిక కష్టాలు ఉన్నా సరే ప్రభుత్వం అమ్మ ఒడి పథకానికి శ్రీకారం చుట్టింది. గురువారం నుంచి అమలు చేయడానికి శ్రీకారం చుట్టారు.
ఇందుకోసం ప్రభుత్వం 6,500 కోట్లను విడుదల చేసింది. ఇబ్బందుల్లో ఉన్నా సరే ఇచ్చిన హామీ అమలు కోసం గత రెండు నెలల నుంచి రాజకీయ ఇబ్బందులను, తెలుగుదేశం చేసిన అప్పుల వడ్డీలను కడుతూ, ఏ సంక్షేమ కార్యక్రమాన్ని ఆపకుండా జగన్ అమలు చేస్తున్న విధానం చూసి ఆర్ధిక నిపుణులు కూడా ఆశ్చర్యపోతున్నారు. లబ్ది దారులను తగ్గించారనే ఆరోపణలు విపక్షాలు చేసినా సరే జగన్ మాత్రం ఇచ్చిన మాట ప్రకారం దాదాపు 43 లక్షల మంది తల్లులకు 15 వేలు అందించే కార్యక్రమం మొదలుపెట్టారు.
దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా హర్షం వ్యక్తమవుతుంది. ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నప్పుడు ఆ స్థాయిలో ఒక సంక్షేమ కార్యక్రమానికి అన్ని నిధులు ఖర్చు చేయడం చూసి ఇచ్చిన మాట కోసం జగన్ ఎక్కడి వరకు అయినా వెళ్తారు అనడానికి నిదర్శనం అంటూ ఆ పార్టీ నేతలు అంటున్నారు. సాధారణంగా ఎన్నికల హామీలను చివరి ఏడాది అమలు చేస్తారు. కాని జగన్ మాత్రం మొదటి ఏడాది నుంచే అమలు చేయడం, ఇతర పథకాలకు డబ్బులను మళ్ళిస్తునే, ఈ కార్యక్రమానికి ఆ స్థాయిలో నిధులు కేటాయించడం అనేది నిజంగా సాహసమే.