ఏపీ సహాయక చర్యల కోసం రంగంలోకి హెలిక్యాప్టర్ లు..!

-

ముందస్తు చర్యల్లో భాగంగా రేణిగుంట విమానాశ్రయానికి 5 హెలికాఫ్టర్లు చేరుకున్నాయి. రాయల చెరువు వద్ద వర్షం కారణంగా మళ్లీ నీరు చేరుతోంది. రాత్రి నుంచి ఇప్పటి వరకు చెరువులో 4 అంగుళాలు నీరు పెరిగింది. ఇసుక ఎంత వేసినా కొట్టుకుపోతుండటం తో అధికారులు ఇంటి నిర్మాణం కు వినియోగించే తెల్ల కంకర రాళ్ళ మూటలను గండి పడిన ప్రాంతంలో వేయిస్తున్నారు. 60 అడుగుల లోతు ఉన్న చెరువు కట్ట, అడుగు భాగంలో 120 అడుగులు కట్ట, పై భాగంలో 45 అడుగుల వెడల్పు కట్టకింద భాగం లో 3 అంగుళాల వెడల్పు తో నీరు వెలుపలకు వస్తోంది.

120 అడుగులున్న కట్ట కింద భాగం దెబ్బ తినటం జరగదని గ్రామస్తులు చెపుతున్నారు. ఇటీవల ఒక అన్య మతానికి చెందిన వారు కబ్జా చేసిన స్థలాలలో ఉన్న తూములను పునరుద్ధరించి ఔట్ ఫ్లో పెరిగెటట్టు చేస్తే రాయల చెరువుకు ఏమీ కాదని గ్రామస్తులు భావిస్తున్నారు. రాయల చెరువు కబ్జాల నేపథ్యం లొనే ఈ దుస్థితి నెలకొంది అని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news